Israel-Iran War: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పెరిగింది. ఇరాన్-ఇజ్రాయల్ మధ్య ఉద్రిక్తతలు మరోకీలక మలుపునకు తిరిగాయి. శనివారం తెల్లవారుజామున ఇరాన్ పై వాయు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీన తమపై ఇరాన్ చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలకు పాల్పడినట్లు వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా వాయు దాడులు ఇరాన్ ను ఏమాత్రం ప్రభావితం చేశాయన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ దాడిని ఇరాన్ లోని స్థానిక స్థావరాలపై ప్రిసైస్ స్ట్రైక్స్ గా ఇజ్రాయెల్ సైన్యం అభివర్ణించింది. ఇజ్రాయోల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్ లోని ప్రభుత్వం నెలల తరబడి చేస్తున్న వరుస దాడులకు ప్రతిస్పందనగా ప్రస్తుతం ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇరాన్ లోని సైనిక స్థావరాలపై కచ్చితమైన దాడులు జరుపుతున్నట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగరి ఓ ప్రకటనలో తెలిపారు. 


కానీ ఇరాన్ మాత్రం ఇంకా ఈ దాడులను ధ్రువీకరించలేదు. పైగా టెహ్రాన్ చుట్టుపక్క వినిపించిన శబ్దాలు తమ వైమానిక రక్షణ చర్యల ఫలితంగా సంభవించాయని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని.. అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. అక్కడి ప్రభుత్వ మీడియా మొదట పేలుళ్లను అంగీకరించింది.  నగరం చుట్టూ శబ్దాలు వచ్చాయని తెలిపింది. సిరియాలోని ప్రభుత్వ మీడియా దాని వైమానిక రక్షణను అక్కడ కూడా  లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. అటు కరాజ్ నగరంలో కూడా పేలుళ్లు వినిపించాయని మరో ఇరాన్ మీడియా పేర్కొంది. 


Also Read: Baba Vanga: 2025లో ప్రపంచం అంతమవుతుందా? బాబా వంగా భవిష్యవాణి మీరే చూడండి..


ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి తర్వాత వైట్ హౌస్ ప్రకటన కూడా వచ్చింది. ఈ నెల ప్రారంభంలో టెహ్రాన్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడి జరిగిన తరువాత ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు ఆత్మరక్షణ కోసం ఒక వ్యాయామం అని వైట్ హౌస్ పేర్కొంది. జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి సీన్ సావెట్ మాట్లాడుతూ సైనిక లక్ష్యాలపై లక్ష్యంగా దాడులు ఆత్మరక్షణ కోసం అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగా  ఈ దాడులు జరిగినట్లు చెప్పారు.


 




ఇరాన్ సైనిక స్థావరాలు, రాజధాని టెహ్రాన్, చుట్టుపక్కల నగరాలపై శుక్రవారం అర్థరాత్రి ఇజ్రాయెల్ బాంబులు వేసింది. ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడిని ధృవీకరించింది. ఇది నెలల తరబడి ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేస్తున్న నిరంతర దాడులకు ప్రతిస్పందనగా పేర్కొంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ నిరంతరం దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది.


Also Read: Love With AI: ఏఐతో ప్రేమాయణం.. డిజిటల్‌ శృంగారం, ఆమెను కలిసేందుకు 14 ఏళ్ల బాలుడి ఆత్మహత్య.. 


 


 





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి