Israel vs Palestina: పాలస్తీనా-ఇజ్రాయిల్ వివాదానికి ఆజ్యం పడింది మొదటి ప్రపంచయుద్ధం సమయంలోనే. ఆ సమయంలో పాలస్తీనాను పాలిస్తున్న ఒట్టోవా సామ్రాజ్యం ఓటమిపాలవడంతో బ్రిటీషు ఆధీనంలో వెళ్లింది. బ్రిటీషు ఎక్కడుంటే అక్కడ రెండు దేశాల మధ్య ఘర్షణలు జరగాల్సిందే కదా..అదే జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదటి ప్రపంచ యుద్ధం సమయ నాటికి పాలస్తీనా ప్రాంతంలో యుూదుల ప్రాబల్యం పెద్దగా లేదు. అదే సమయంలో యూదులకు దేశాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను బ్రిటన్ తీసుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. పాలస్తీనా తమ పూర్వీకులదని యూదులు, తమదేనని అరబ్బులు ఘర్షణకు దిగారు. మరోవైపు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో హిట్లర్ యూదుల్ని ఊచకోత కోస్తుండటంతో ప్రాణాలు అరచేతపట్టుకుని యూదులు లక్షలాదిగా పాలస్తీనాకు తరలివచ్చారు. దాంతో యూదుల సంఖ్య పెరగడంతో ఘర్షణలు మళ్లీ పెరిగాయి. 


రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరుకు తెరదించేలా ఐక్యరాజ్యసమితి ఓ ప్రతిపాదన చేసింది. పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు, అరబ్బులకు పంచివ్వాలి. జెరూసలెం నగరాన్ని అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలి. ఈ ప్రతిపాదనకు యూదులు అంగీకరించినా అరబ్బులు వ్యతిరేకించారు. ఫలితంగా సమస్య మళ్లీ మొదటికి రావడంతో ఇక చేసేదిలేక బ్రిటీషు దొరలు 1948లో పాలస్తీనాను వదిలి వెళ్లిపోయారు. అంతే ఇదే అవకాశంగా చేసుకుని యూదులు ఇజ్రాయిల్ పేరుతో ప్రత్యేక దేశాన్ని ప్రకటించుకున్నారు. దీంతో పాలస్తానా-ఇజ్రాయిల్ యుద్ధం అనివార్యమైంది. అరబ్ దేశాలు కూడా పాలస్తీనాకు మద్దతుగా నిలిచాయి. 


ఈజిప్టు, జోర్జాన్ దేశాలు రంగంలో దిగాయి. జోర్డాన్ వెస్ట్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంటే ఈజిప్టు గాజా స్ట్రిప్ స్వాధీనం చేసుకుంది. జెరూసలెం పశ్చిమ భాగాన్ని ఇజ్రాయిల్ దళాలు, తూర్పు భాగాన్ని జోర్డాన్ పంచుకున్నాయి. 1967లో మరోసారి జరిగిన యుద్ధంలో తూర్పు జెరూసలెం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌లను ఇజ్రాయిల్ కైవసం చేసుకుంది. గాజా మాత్రం 2005లో హమాస్ చేతికి వెళ్లిపోయింది. ఇప్పటికీ గాజా హమాస్ ఆధిపత్యంలోనే ఉంది. 


హమాస్ నేపధ్యమేంటి


హమాస్ సంస్థ 1987లో ఓ రాజకీయ పార్టీగా అవతరించింది. ఇజ్రాయిల్‌పై దాడులే లక్ష్యంగా ముందుగా సాగడంతో చాలాదేశాలు ఉగ్రవాద సంస్థగా ముద్రవేశాయి. ఇక అప్పట్నించి దాడులు ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. మాతృభూమి కోసం పోరాడుతున్న సంస్థగా హమాస్ అభివర్ణించుకుంటే ఇజ్రాయిల్‌కు వంతపాడే దేశాలు మాత్రం ఉగ్రవాద సంస్థగా ముద్ర వేస్తున్నాయి. 


సంక్లిష్ట సమస్యలు ఇవే


జెరూసలెం మొత్తం ప్రాంతాన్ని ఇజ్రాయిల్ రాజధానిగా ప్రకటించుకోగా, తూర్పు ప్రాంతాన్ని పాలస్తీనా భవిష్యత్ రాజధానిగా ప్రకటించుకుంది. 2005లో ఇజ్రాయిల్ గాజా నుంచి వైదొలగినా ఐక్యరాజ్యసమితి ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని ఆక్రమిత భూభాగమంటోంది. వెస్ట్ బ్యాంక్ ఇజ్రాయిల్ ఆదీనంలో ఉండటం పాలస్తీనాకు మింగుడుపడటం లేదు. వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయిల్ అంతర్జాతీయ నిబంధనలు కాదని అక్రమ కట్టడాలు కట్టింంది. ఇదో వివాదంగా మారింది. 


Also read: India Supports Israel: ఇజ్రాయిల్‌కు అండగా ఇండియా, హర్షం వ్యక్తం చేస్తున్న ఇజ్రాయిల్ దేశస్థులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook