ఇటలీలో ఆగని కరోనా మృత్యుఘోష
ఇటలీని కరోనా మహమ్మారి వదిలడం లేదు. ఇప్పటికే దేశంలో ఏడు వేలకు పైగా మరణాలు సంభవించాయి. పాజిటీవ్ కేసులు నిత్యం పెరిగిపోతున్నాయి.
రోమ్: మహమ్మారి కరోనా వైరస్ (Coronavirus) చైనాలో పుట్టుకొచ్చినా దాని ప్రభావాన్ని అధికంగా చవిచూసింది ఇటలీ. చైనాలో కరోనా మరణాలు ఎప్పుడో తగ్గుముఖం పట్టినా.. ఇటలీలో మాత్రం మృత్యుఘోష ఆగడం లేదు. బుధవారం నాటికి ఇటీలో మరణాల సంఖ్య 7503కి చేరుకుంది. గత నాలుగు రోజుల్లో రెండు వేల మంది చనిపోయారు. కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 74,386కి చేరుకుందని సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. Must Read: కరోనా వదంతులపై ఈ 6 నిజాలు తెలుసుకోండి
ఫిబ్రవరి 21న తొలికేసు నమోదైనప్పుడే ఇటలీ చర్యలు తీసుకోని కారణంగా మరణాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదని ఇతర దేశాల వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. కాగా, బుధవారం ఒక్కరోజే 1036 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కోవిడ్19 నుంచి కోలుకున్న ఇటలీ వాసుల సంఖ్య 9362కు చేరుకుంది. కరోనాను వాడేస్తున్న పులిహోర రాజాలు..!
కాగా, మిలన్ నగరం సమీపంలోని ఉత్తర లోంబార్డీ ప్రాంతంలోనే దేశంలో సగానికి పైగా మరణాలు సంభవించాయి. లోంబార్డీలోనే 20,591 కోవిడ్ పాజిటీవ్ కేసులు నమోదు కావడం గమనార్హం. లోంబార్డీ తర్వాత రోమాగ్న (8,256), వెనెటో (5,745), పీడ్మాంట్ (5,536) కోవిడ్19 కేసులలో లోంబార్డీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ వారాంతానికి ఇటలీలో మరణాల సంఖ్య, కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ రనేరి గెర్రా దేశ అధికారులను హెచ్చరించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone
ఇస్మార్ట్ భామ అందాల ‘నిధి’ Bold photos