Pegasus Spyware: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెగసస్ స్పైవేర్ ఆందోళన రేపుతోంది. పెగసస్ సాఫ్ట్‌వేర్ దుర్వినియోగంపై పెద్దఎత్తున కథనాలు వస్తున్నాయి. పలు దేశాల్లో వివాదాస్పదమైంది. ఈ నేపధ్యంలో ఆ దేశాల్లో పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను..ఎన్ఎస్‌వో కంపెనీ బ్లాక్ చేసిందా..అమెరికా మీడియా కథనాల్లో నిజమెంత..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇజ్రాయిల్ కంపెనీ ఎన్ఎస్‌వో(NSO Group) అభివృద్ధి చేసిన పెగసస్ స్పైవేర్ (Pegasus spyware)ప్రపంచవ్యాప్తంగానే కాకుండా ఇండియాలో ఆందోళన రేపుతోంది. ఈ సాఫ్ట్‌వేర్ దుర్వినియోగమైందనే వార్తలు ఎక్కువగా విన్పిస్తున్నాయి.ఎన్ఎస్‌వో గ్రూప్ తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ను పలు దేశాల ప్రభుత్వాలు ఉగ్రవాదం, నేరాల కట్టడి కోసం కొనుగోలు చేస్తాయి. అయితే దీనికి బదులుగా పౌరులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, మంత్రులు, మానవ హక్కుల నేతలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులపై నిఘా కోసం దుర్వినియోగం చేస్తున్నట్టుగా వాషింగ్టన్ పోస్ట్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి మీడియా సంస్థలు బహిర్గతపరిచాయి. కొన్నిదేశాల్లో ఫోన్ల హ్యాకింగ్‌కు ఉపయోగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాము అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ దుర్వినియోగం కావడంపై ఎన్ఎస్ఓ గ్రూప్ ఆగ్రహంగా ఉందని అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కొన్నిదేశాల్లో ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగించకుండా ఎన్ఎస్‌ఓ గ్రూప్ స్వయంగా బ్లాక్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. తమ క్లయింట్స్ ఈ టెక్నాలజీను వాడకుండా బ్లాక్ చేసిందని తెలుస్తోంది. 


ఇప్పటికే ఐదు ప్రభుత్వాల్ని ఎన్ఎస్ఓ గ్రూప్ బ్లాక్ చేసినట్టు వాషింగ్టన్ పోస్ట్ (Washington post)ప్రచురించింది. మెక్సికో, సౌదీ అరేబియా, దుబాయ్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయని సమాచారం. ప్రభుత్వాలు ఫోన్ హ్యాకింగ్(Phone Hacking) పాల్పడిన వ్యవహారానికి తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఎన్ఎస్ఓ గ్రూప్ చెబుతోంది. పెగసస్ స్పైవేర్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడంతో ఇజ్రాయిల్ (Izrael)రక్షణ శాఖ సైతం అంతర్గత దర్యాప్తు చేపట్టింది. ఎన్ఎస్ఓ సంస్థకు ఇప్పటికే 40 దేశాల్లో 60కి పైగా కస్టమర్లు ఉన్నారు. 


Also read: ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అధ్యక్ష స్థానం ఇక ఇండియాదే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook