జాదవ్ భార్య కు మద్దతుగా.. పాక్ ఎంబసీ ఎదుట నిరసన
జాదవ్ భార్యకు మద్దతుగా.. పాక్ ఆమెతో ప్రవర్తించిన తీరుకు వ్యతిరేకంగా భారత ఎన్ఆర్ఐలు(ఇండో-అమెరికన్లు) అమెరికా రాజధాని వాషింగ్టన్ లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
జాదవ్ భార్యకు మద్దతుగా.. పాక్ ఆమెతో ప్రవర్తించిన తీరుకు వ్యతిరేకంగా భారత ఎన్ఆర్ఐలు(ఇండో-అమెరికన్లు) అమెరికా రాజధాని వాషింగ్టన్ లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. 'చెప్పుల దొంగ పాకిస్థాన్ (చప్పల్ కా చోర్ పాకిస్థాన్)' అని రాసిఉన్న ప్లకార్డులను పట్టుకొని.. ఆ దేశానికి వ్యతిరేకంగా నినదించారు. పాకిస్తానీ నిరసనకారులు నీచ (అట్టడుగు) బలూచ్ సమాజం నుండి వచ్చారన్నారు.
"కుల్భూషణ్ జధవ్ తల్లి, భార్య పట్ల పాక్ అమానుషంగా వ్యవహరించింది. వారి కుటిల దుర్బుద్ధి ఏంటో ప్రజలకు మరోసారి అర్థమయ్యింది" అని నిరసనకారులలో ఒకరు చెప్పారు. అసలు పాకిస్థాన్ ఉద్దేశ్యమేంటీ? అమెరికా నుండి డాలర్లు తీసుకురా, భారత్ చెప్పదెబ్బలు తిను!!" అన్న చందంగా ఉందని మరొక నిరసనకారుడు చెప్పారు.
గూఢచర్య ఆరోపణలపై పాక్, మాజీ భారత నౌకాదళ అధికారి కుల్భూషణ్ జాధవ్ కి మరణశిక్ష విధించింది. గత నెలలో అతని భార్య, తల్లి అతనిని కలుసుకున్నారు. వారు ఒక గ్లాస్ గోడతో వేరుచేయబడిన గదిలో ఉంచబడ్డారు. వారు గాజు ద్వారా ఒకరినొకరు చూసుకున్నారు.. కానీ ఫోన్ ద్వారా మాట్లాడారు. సమావేశానికి ముందు, కుల్భూషణ్ జాదవ్ తల్లి, భార్య దుస్తులను మార్చుకున్నారు. పాకిస్తాన్ అధికారులు జాధవ్ భార్య బూట్లు లాక్కొని, తిరిగి ఇవ్వలేదు.