Oldest Whisky: ప్రపంచంలో అరుదైన వస్తువుల వేలం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే అరుదైన సింగిల్ మాల్ట్ విస్కీ కోసం జరిగిన వేలంలో రికార్డు చోటుచేసుకుంది. భారీ ధరకు కేవలం ఒక బాటిల్ దక్కించుకున్నాడు ఆ వ్యక్తి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు పెద్దలు. విస్కీ విషయంలో ఈ మాట సరిగ్గా సరిపోతుంది. విస్కీ ఎంత ఓల్డ్ స్టాక్ అయితే అంత డిమాండ్ ఉంటుంది. టర్కీలో ఒక విస్కీ బాటిల్ కోసం జరిగిన వేలం అందర్నీ నిర్ఘాంతపర్చింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో డ్యూటీ ఫ్రీ లిక్కర్ షాపులో జపాన్‌కు చెందిన సుంటోరీ అనే లిక్కర్ సంస్థ ఉత్పత్తి చేసిన ది యమజాకీ విస్కీని వేలానికి పెట్టారు. ఈ విస్కీ బాటిల్ 55 ఏళ్ల పాతది.1960లో మూడు అరుదైన రకాలకు చెందిన సింగిల్ మాల్ట్ విస్కీలను బ్లెండ్ చేసి యమజాకీ విస్కీని తయారు చేశారు. ఈ వేలంలో మొత్తం 8 మంది పోటీపడ్డారు. చైనాకు చెందిన ఓ ప్రయాణీకులు రికార్డు స్థాయిలో  (Oldest Whisky) 4 కోట్ల 14 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నాడు. 


అరుదైన వస్తువులకు వేలం పాట వేయడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఇలాంటి వేలం పాట చరిత్రలో అరుదైన ఘట్టం నమోదైంది. సింగిల్‌ మాల్ట్‌ విస్కీని (Single Malt Whisky) దక్కించుకునేందుకు కోట్ల రూపాయలు చెల్లించేందుకు ఓ వ్యక్తి వెనుకాడకపోవడంతో ఈ రికార్డు చోటు చేసుకుంది. ఇదొక అందమైన గ్రీక శిల్పం వంటిదని సుంటోరీ కంపెనీ ఛీప్ బ్లెండర్ తెలిపారు. సుంటోరీ సంస్థ ఎప్పుడూ అరుదైన రకానికి చెందిన విస్కీని తయారు చేసి మార్కెట్‌లో లిమిటెడ్‌గా అందిస్తుంది. ప్రత్యేకమైన వ్యక్తులకే సరఫరా చేస్తుంటుంది. 2020లో కేవలం వంద బాటిల్స్‌ను మాత్రమే మార్కెట్‌లో రిలీజ్ చేసింది. 


Also read: Corona Will Not Vanish: కరోనా వైరస్ ఎప్పటికీ మనతోనే ఉంటుంది: డబ్ల్యూహెచ్​ఓ నిపుణులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook