Kabul Bomb Blast: అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది. వజీర్ ముహమ్మద్ అక్బర్ ఖాన్ మసీదు సమీపంలో చోటుచేసుకున్న ఈ భారీ పేలుడుతో సమీప ప్రాంతాలన్నీ దద్దరిల్లిపోయాయి. చుట్టూరా దట్టమైన పొగ అలుకుంది. దీంతో అక్కడేం జరిగిందో, జరుగుతుందో అర్థం కాని భయంకరమైన పరిస్థితి నెలకొంది. శుక్రవారం ప్రార్థనల తర్వాత మసీదు సమీపంలో పేలుడు జరగడంతో నమాజ్‌కి వచ్చే రద్దీనే లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి జరిగినట్టు ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. ఈ ఘటనపై కాబూల్ పోలీసు చీఫ్ ఖలీద్ జద్రాన్ స్పందించారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాబూల్ బాంబు పేలుడులో కాజ్వాల్టీస్ ఉన్నాయి కానీ అందులో ఎంతమంది చనిపోయారో.. ఎంత మంది గాయపడ్డారు అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని కాబూల్ పోలీసు ఉన్నతాధికారి ఖలీద్ జద్రాన్ మీడియాకు తెలిపారు. రెండు రోజుల క్రితం కాబూల్‌లోని ఓ రెస్టారెంట్‌లో సంభవించిన పేలుడులోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులోనూ ఇప్పటికీ కొంతమంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కాబూల్ రెస్టారెంట్ బ్లాస్ట్ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. ఈ పేలుడు ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే కొద్దిసేపటి క్రితం మసీదు వద్ద చోటుచేసుకున్న తాజా పేలుడు కాబూల్‌ని షేక్ చేసింది. మసీదు వద్ద పేలుడు ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Also Read : Joe Biden: అమెరికా అధ్యక్షుడి వింత చేష్టలు.. జోబైడెన్ కు ఏమైంది? వైరల్ వీడియో...


Also Read : Iran Protest: ఇరాన్ లో హిజాబ్‌ అంశంపై భగ్గుమన్న నిరసనలు.. ఘర్షణల్లో 31 మంది మృత్యువాత!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి