Kim Jong-un: వీడియోలు చూశారని ఏడుగురిని ఉరి తీసిన ఉత్తర కొరియా నియంత కిమ్
Kim Jong un executed 7 in three years: సౌత్ కొరియా పాప్ వీడియోల అంటే కిమ్ జోంగ్ ఉన్‌కు అస్సలు ఇష్టం ఉండదు. వాటిని విషపు క్యాన్సర్‌గా పేర్కొంటారు కిమ్ జోంగ్ ఉన్. అలాంటి సంస్కృతి నార్త్ కొరియాకు పాకకుండా ఉండేందుకు చాలా కఠిన శిక్షలు అమలు చేస్తున్నారట కిమ్ జోంగ్ ఉన్.
Kim Jong un executed 7 in three years for watching South Korean videos: ఉత్తరకొరియాలో ఇటీవల ఏడుగురికి బహిరంగ మరణశిక్ష విధించారు. ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong-un)ఆదేశంతో ఈ శిక్షను అమలు చేశారు. దక్షిణకొరియాకు సంబంధించిన వీడియోలు చూడడంతో పాటు వాటిని ఇతరులకు షేర్ చేశారనే ఆరోపణలపై వారికి ఈ శిక్ష విధించారు. సౌత్ కొరియా పాప్ వీడియోల అంటే కిమ్ జోంగ్ ఉన్‌కు అస్సలు ఇష్టం ఉండదు. వాటిని విషపు క్యాన్సర్‌గా పేర్కొంటారు కిమ్ జోంగ్ ఉన్. అలాంటి సంస్కృతి నార్త్ కొరియాకు పాకకుండా ఉండేందుకు చాలా కఠిన శిక్షలు అమలు చేస్తున్నారట కిమ్ జోంగ్ ఉన్.
సియోల్ కేంద్రంగా ఉన్న ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్ (Transitional Justice Working Group) అనే మానవ హక్కుల సంస్థ ఉత్తరకొరియా ప్రతిస్పందన పేరుతో ఇటీవల ఒక అధ్యయనం చేపట్టింది. ఉత్తర కొరియాలో చేపట్టే బహిరంగ మరణశిక్షల గురించి, ఆ మృతదేహాలను పూడ్చి వేసే ప్రాంతాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసింది.
ఈ నేపథ్యంలో గత ఆరేళ్లలో ఉత్తరకొరియా (North Korea) నుంచి పారిపోయి వచ్చిన 683 మందిని ఇంటర్వ్యూ చేయగా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. కిమ్ ప్రభుత్వంలో ఇప్పటివరకు పలు హత్యలపై నివేదిక రూపొందించింది. అయితే వీరందరినీ కూడా ఉత్తర కొరియ ఫైరింగ్ స్క్వాడ్‌తో చంపించినట్లు వెల్లడించింది. మాదక ద్రవ్యాల సరఫరా, వ్యభిచారంలాంటి నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఉత్తరకొరియా ప్రభుత్వం చాలా మందిని చంపినట్లు పేర్కొంది. మరికొందరికి మరణశిక్ష అమలుచేసినట్లు వెల్లడింది.
Also Read : Breaking News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో Omicron కేసు నమోదు
అంతేకాదు సౌత్ కొరియా (South Korea) ఎంటర్‌టైన్‌మెంట్ అంటే కూడా కిమ్‌కు అస్సలు నచ్చదు. ఆ దేశానికి చెందిన సినిమాలు, పాప్ వీడియోలను విక్రయిస్తున్నాడనే ఆరోపణతో ఈ ఏడాది మేలో ఓ వ్యక్తిని ఉత్తరకొరియా ప్రభుత్వం ఉరి తీసింది. ఇలా కిమ్ ప్రభుత్వంలో చాలా బహిరంగ మరణశిక్షలను అమలు చేశారు.
Also Read : Harish Rao: పీయుష్ గోయల్ బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే-హరీష్ రావు డిమాండ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి