Liz Truss Resignation: బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన 45 రోజుల్లోనే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. బ్రిటన్ ఆర్థికంగా, రాజకీయం పరంగా పెను సంక్షోభంలో కూరుకుపోవడమే లిజ్ ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి కారణమైంది. బ్రిటన్ కి స్వల్పకాలం సేవలు అందించిన ప్రధానిగా లిజ్ ట్రస్ పేరు బ్రిటన్ రికార్డులకెక్కింది. లిజ్ ట్రస్ తన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందిగా కన్జర్వేటివ్స్ పార్టీ ఎంపీల నుంచే తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు. బ్రిటన్ కేబినెట్‌లోనూ సొంత ఎంపీలే లిజ్ ట్రస్‌ని దూరం పెట్టడం, మద్దతు ఇవ్వకపోవడం వంటివి ఆమెను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన రాజీనామా గురించి లిజ్ ట్రస్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక సంక్షోభం ఓవైపు.. రాజకీయ అనిశ్ఛితి మరోవైపు.. వెరసి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పరిస్థితి లేకపోయిందని.. ఈ కారణంగానే తాను ప్రధాని పోస్టుకు రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. 10 డౌనింగ్ స్ట్రీట్ లోని తన అధికారిక నివాసం బయట మీడియాతో మాట్లాడుతూ లిజ్ ట్రస్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


ఇవాళ ఉదయమే తాను 1922 కమిటీ చైర్మన్ సర్ గ్రాహం బ్రాడీని కలిసి పరిస్థితిని వివరించానని లిజ్ ట్రస్ తెలిపారు. మరో వారం రోజుల్లోనే దేశానికి కొత్త ప్రధాని వస్తారని.. అప్పటి వరకు తాను తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతానని అన్నారు.  



బ్రిటన్ ప్రధానిగా స్వల్ప కాలం పనిచేసిన వారిలో జార్జ్ కానింగ్ కూడా ఒకరు. 1827 లో జార్జ్ 119 రోజులు బ్రిటన్ ప్రధానిగా కొనసాగారు. గత ఆరేళ్లలో లిజ్ ట్రస్ బ్రిటన్‌కి ఆరో ప్రధాని. 2016లో బ్రిటన్ యురోపియన్ యూనియన్ నుంచి వైదొలగే క్రమంలో ఓటింగ్ చేపట్టినప్పటి నుంచే బ్రిటన్ రాజకీయాలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటూ వస్తున్నాయి. ఇక ఇదిలావుంటే, లిజ్ ట్రస్ రాజీనామాతో ప్రస్తుతం అందరి కళ్లు బ్రిటన్ మాజీ ఛాన్సెలర్ రిషి సునక్‌పై పడ్డాయి. సెప్టెంబర్‌లో జరిగిన ప్రధాని పోటీల్లో లిజ్ ట్రస్ చేతిలో ఓటమి చెందిన రిషి సునక్‌ని ప్రధాని పదవి వరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అగ్రరాజ్యాల్లో ఒకటైన బ్రిటన్ ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోవడం బ్రిటన్‌తో ముడిపడి ఉన్న వ్యాపారాలపై సైతం దుష్ప్రభావం చూపిస్తోంది.


Also Read : Hafiz Talha Saeed: కరడుగట్టిన పాకిస్థాన్ ఉగ్రవాదులకు అండగా నిలిచిన చైనా


Also Read : Russia vs Ukraine War: రష్యా vs ఉక్రెయిన్ వార్.. భారతీయులకు హెచ్చరికలు


Also Read : RussianPlane Crash : 9 అంతస్తుల అపార్ట్మెంట్లోకి దూసుకొచ్చిన రష్యన్ ఫైటర్ జెట్.. భారీగా ప్రాణనష్టం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి