Boksburg Explosion Videos: ఎల్పీజీ ట్యాంకర్ పేలి 10 మంది మృతి, 40 మందికి గాయాలు
Boksburg Explosion Videos: ఎల్పీజీ గ్యాస్ లోడుతో వెళ్తున్న భారీ ట్యాంకర్ పేలిందనే సమాచారంతో అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో రెండోసారి పేలుడు సంభవించడంతో రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న పలువురు ఫైర్ ఫైటర్స్ ప్రాణాలు కోల్పోగా ఇంకొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.
Boksburg Explosion Videos: ఎల్పీజీ ట్యాంకర్ పేలి 10 మంది మృతి చెందగా మరో 40 మందికి గాయాలైన ఘటన సౌతాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో చోటుచేసుకుంది. జొహన్నెస్‌బర్గ్‌లోని బోక్స్‌బర్గ్‌లో శనివారం ఎల్పీజీ ఇంధనంతో వెళ్తున్న ఒక భారీ ట్యాంకర్.. ఒక సబ్‌వే బ్రిడ్జి కింది నుండి వెళ్లే క్రమంలో బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. ఈ క్రమంలోనే పైన బ్రిడ్జికి, కింద రోడ్డుకి మధ్యలో ఒత్తిడికి గురైన ట్యాంకర్ లోంచి ఎల్పీజీ లీకైంది. ట్యాంకర్‌లోంచి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లీక్ అవడం, ఆ వెంటనే రాపిడి కారణంగా ట్యాంకర్ లోంచి మంటలు చెలరేగి పేలుడుకు దారితీసింది.
భారీ నష్టం కలిగించిన రెండో పేలుడు
ఎల్పీజీ గ్యాస్ లోడుతో వెళ్తున్న భారీ ట్యాంకర్ పేలిందనే సమాచారంతో అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో రెండోసారి పేలుడు సంభవించడంతో రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న పలువురు ఫైర్ ఫైటర్స్ ప్రాణాలు కోల్పోగా ఇంకొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ధాటికి ఒక ఫైర్ ఇంజిన్, రెండు మోటార్ వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నట్టు ఎమర్జెన్సీ సేవల మీడియా ప్రతినిధి విలియం ఎంటల్డి తెలిపారు.
ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏజెన్స్ ఫ్రాన్స్-ప్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉండటమే అందుకు కారణంగా అధికారులు చెబుతున్నారు. రెండోసారి పేలుడుకు సంబంధించిన వీడియోలను కొంతమంది ట్విటర్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. పేలుడు ధాటికి జనం దూరంగా పరిగెత్తడం ఆ వీడియోల్లో చూడొచ్చు.
ఇది కూడా చదవండి : Bf.7 Variant Scare: మోగుతున్న డేంజర్ బెల్స్.. కేవలం 20 రోజుల్లో 250 మిలియన్ల మందికి కొవిడ్
ఇది కూడా చదవండి : Coronavirus Zombie Infection: జాంబీ ఇన్ఫెక్షన్ హెచ్చరిక.. కరోనా మృతదేహాలను తాకితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి : Hawaii Flight Turbulence: విమానంలో ఎగిరిపడ్డ ప్రయాణికులు.. 36 మందికి తీవ్ర గాయాలు! పైకప్పుకు కూడా క్రాక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook