ఆ లగ్జరీ ఫ్లైట్ ( Luxury Flight )ను అమ్మకానికి పెట్టారు. ఆధునిక, విలాసవంతపు సౌకర్యాలు కలిగిన ఆ విమానం ధర కూడా భారీగానే నిర్ణయించారు. కొనే నాధుడి కోసం నిరీక్షణ కొనసాగింది. చివరికి ఏమైంది ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



ఆ విమానం లగ్జరీకు వేదిక. గత ప్రభుత్వాల అవినీతికి నిదర్శనం. ఆ లగ్జరీ ఫ్లైట్ పేరు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ( Boeing 787 Dream liner ). దీన్ని సొంతం చేసుకోవడం ఎవరికైనా నిజంగానే ఓ డ్రీమ్. అందుకే మెక్సికో ( Mexico Government ) ప్రభుత్వం చాలా కాలంగా ఈ ఫ్లైట్ ను అమ్మడానికి ప్రయత్నిస్తోంది. అందుకే సేల్ కోసం ఈ ఫ్లైట్ ను అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఇన్నాళ్లూ ఉంచారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర 130 మిలియన్ డాలర్లు. చాలాకాలం నిరీక్షణ అనంతరం అంత ధర పెట్టి కొనుగోలు చేసేవారు లేక..ఆ విమానం తిరిగొచ్చేసింది. మెక్సికో విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ అవుతున్న దృశ్యాలిప్పుడు వైరల్ అవుతున్నాయి. 


బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ కధ:


2012లో మెక్సికో మాజీ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో దీన్నీ స్వాధీనం చేసుకున్నారు. 80 మంది ప్రయాణించేలా ఆధునీకరించారు. బాత్ రూమ్ లు సైతం పాలరాయితో నిర్మించారు. ఈ విమానంలో ఒక ప్రెసిడెంట్ సూట్, ప్రైవేట్ బాత్ కూడా ఉన్నాయి. ఈ లగ్జరీ జెట్ లో రాఫెల్ విమానం కూడా ఉన్నట్టు కొంతమంది చెబుతున్నారు. 130 మిలియన్ డాలర్ల ( 130 million Dollars ) భారీ ధరకు ఎవరూ కొనడానికి ముందుకు రాకపోవడంతో తిరిగి మెక్సికోకు రప్పించారు. ఓ వ్యక్తి 120 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చినట్టు సమాచారం. దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు. Also read: Corona Virus: ఆ దేశంలో కరోనా ఇప్పుడు జీరో