Malawi vice prisident died in plane crash: ఆఫ్రికాదేశమైన మలావీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆదేశ ఉపాధ్యక్షుడు  సౌలస్ షిలిమాతో పాటు మరో 9 మంది సైనిక విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ఆ విమానం గల్లంతయ్యింది. దీనిపై అధికారులు వెంటనే, రంగంలోకి దిగి వెతుకులాట ప్రారంభించారు. డ్రోన్లు, హెలికాప్టర్ లతో సెర్చ్ నిర్వహించారు. అదేవిధంగా అమెరికా, బ్రిటన్, నార్వే వంటి పలు దేశాలు కూడా సహాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే .. విమాన శకలాలను గుర్తించినట్లు అధికారులు గుర్తించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..


విమానంమంతా తునాతునకలైనట్లు అధికారులు గుర్తించారు. హెలికాప్టర్ లో ఉన్న వారంతా చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమాతో పాటు.. అందులో ప్రయాణిస్తున్న మరో 9 మంది కూడా దుర్మరణం చెందినట్లు.. ఆ దేశ అధ్యక్షుడు  లాజరస్ చక్వేరా వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మలావీ రాజధాని లిలోంగ్వే నుంచి బయలు దేరిన ఆ విమానం 370 కిలో మీటర్లు దూరంలో ఉన్న జుజు ఇంటర్నేషనల్ విమానశ్రయంలో దిగాల్సి ఉంది. 


Read more; Us man forceful sneeze: బాప్ రే.. గట్టిగా తుమ్మగానే.. పొట్ట చీల్చుకుని బైటపడ్డ పేగులు.. ఎక్కడో తెలుసా..?..


కానీ వాతావరణం అనుకూలంగా లేదంటూ ఏవియేషన్ అధికారులు సూచించారు. అక్కడకు వెళ్లోద్దని, తిరిగి లిలోంగ్వేకు వెళ్లిపోవాలని ఏడీసీ సూచించింది. అయిన కూడా విమానయాన సిబ్బంది పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే కాసేపటికే ఉపాధ్యక్షుడు  ప్రయాణిస్తున్న విమానం నుంచి ఏవియేషన్ అధికారులకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ దారుణ ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. 
 


ఇదిలా ఉండగా.. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆ దేశ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దొల్లహియన్ చనిపోయిన విషయం తెలిసిందే. తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతుండటంతో, విమానంలో ప్రయాణించేందుకు కొందరు ప్రముఖులు ఆందోళన వ్యక్తంచేస్తున్నట్లు తెలుస్తోంది. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter