మాలే: రాజకీయ సంక్షోభం నెలకొన్న మాల్దీవుల్లో పదిహేను రోజులపాటు ఎమర్జెన్సీ విధించారు. సుప్రీంకోర్టుతో వివాదం నేపథ్యంలో అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయంతో అనుమానితులను అరెస్టు చేయడానికి, వారిని నిర్బంధించడానికి భద్రతాదళాలకు అధికారం లభిస్తుంది. కాగా, అధ్యక్షుడి నిర్ణయంతో దేశంలో తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పును ఇచ్చింది. ఈ తీర్పును అధ్యక్షుడు వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే అధ్యక్షుడికి, సుప్రీం కోర్టుకు మధ్య వివాదం నెలకొంది. యమీన్‌ అత్యవసర పరిస్థితిని విధించినట్లు ప్రభుత్వ టీవీ ఛానల్ లో చదివి వినిపించారు అతని వ్యక్తిగత కార్యదర్శి అజిమా షుకూర్‌.


అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన కొన్ని గంటలకే మాజీ అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్, చీఫ్ జస్టిస్ అబ్దుల్లా సయీద్, సుప్రీంకోర్టు జస్టిస్ అలీ హమీద్, న్యాయమూర్తి హసన్ సయీద్ లను అరెస్టు చేశారు. కాగా, అవసరమైతే తప్ప భారతీయులు కొన్నిరోజులు మాల్దీవులకు వెళ్లకూడదని భారత విదేశాంగ శాఖ సూచించింది.