Man dressed as Joker injures 17 on Tokyo train: ప్రతి ఏటా అక్టోబర్‌ 31న హాలోవీన్(Halloween) సంబరాలు జరుగుతుంటాయి. జపాన్ రాజధాని టోక్యో(Tokyo)లో కూడా హాలోవీన్ కార్యక్రమం జరిగింది. చిత్ర విచిత్రమైన గెటప్పుల్లో వచ్చి జనాలను భయభ్రాంతులకు గురి చేయడమే దీని ఉద్దేశ్యం.ఇందులో భాగంగా టోక్యోలో..‘'జోకర్‌'’వేషధారణ(Batman's Joker costume attacked passengers)లో వచ్చిన ఓ వ్యక్తి రైల్లో బీభత్సం సృష్టించాడు. ఇతడు రైలులో మంటపెట్టడమే కాకుండా...కత్తితో దాడి చేసి 17 మందిని గాయపరిచాడు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే..
టోక్యో నగరంలోని ప్రయాణికులు హాలోవిన్‌ పార్టీలకు బయల్దేరిన సమయంలో... ఊదా, ఆకుపచ్చ రంగు సూటు వేసుకొన్న వ్యక్తి ఒక కత్తి పట్టుకొని వచ్చి రైలు(Train)లోని ప్రయాణికులపై దాడి చేశాడు. అనంతరం రైలు బోగీలో ఒక ద్రవాన్ని చల్లి నిప్పు పెట్టాడు. తొలుత ప్రజలు ఇదంతా హాలోవిన్‌ పార్టీలో భాగమని భ్రమించారు. ఈ ఘటన జపాన్‌ కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో కొక్రయూ స్టేషన్‌లో చోటు చేసుకొంది. 


Also Read: Arunachal Pradesh: నల్లగా మారిన నది...వేలాది సంఖ్యలో చేపలు మృతి!


నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేసినట్లు సమాచారం. నిందితుడికి బ్యాట్‌మన్‌ సినిమాలో జోకర్‌(Joker) పాత్ర ఇష్టమని పోలీసులు చెప్పినట్లు క్యోడో న్యూస్‌ ఔట్‌లెట్‌ పేర్కొంది. అతడు అక్కడి వారిని చంపి మరణ శిక్ష పొందాలని భావించినట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. అతని దాడిలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 2019లో జోక్విన్‌ ఫోనిక్స్‌ నటించిన ‘జోకర్‌’ చిత్రంలో ఇదే విధంగా రైల్లో దాడి చేసిన సన్నివేశాలు ఉన్నాయి. నిందితుడు వాటిని అనుకరించే ప్రయత్నం చేశాడు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook