Bangladesh Fire: బంగ్లాదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఆగ్నేయ బంగ్లాదేశ్‌లోని ఇన్‌ల్యాండ్ షిప్పిం్గ కంటైనర్ డిపోలో మంటలు వచ్చాయి. నిమిషాల్లోనే మొత్తం వ్యాపించాయి.మంటల్లో చిక్కుకుని ౩౦ మంది సజీవ దహనమయ్యారు. స్పాట్ లోనే 16 మంది చనిపోగా.. మరో 14 మంది హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు. 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో మరికొందరికి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని చెబుతున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగ్లాదేశ్ లో ప్రముఖ  ఓడరేవు నగరమైన చిట్టగాంగ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతకుండ వద్ద శనివారం రాత్రి కంటైనర్ సదుపాయంలో మంటలు చెలరేగాయి. మంటలు విస్తరించాకా.. కంటైనర్ డిపోలు భారీ పేలుడు సంభవించింది. రసాయనాలు కలిగిన కంటైనర్లు పేలడంతో తీవ్రత పెరిగిందని తెలుస్తోంది. కంటైనర్లు పెద్ద పెద్ద శబ్దాలతో వరుసగా పేలిపోయాయని స్థానిక అధికారులు తెలిపారు. కంటైనర్ డిపోలో మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. డిపోలో ఆదివారం ఉదయం కూడా సహాయచర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మంటలు అదుపు చేసే క్రమంలో 40 మంది ఫైర్ సిబ్బంది, 10 మంది పోలీసులు తీవ్రంగా గాయపడినట్లు చిట్టగాంగ్ ఉన్నతాధికారులు చెప్పారు. ఐదుగురు ఫైర్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం.


పేలుడు ధాటికి పరిసర ప్రాంతాలు వణికిపోయాయని, సమీపంలోని ఇళ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చిట్టగాంగ్ సివిల్ సర్జన్ మహ్మద్ ఇలియాస్ హుస్సేన్ తెలిపారు. గాయపడిన వారిలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కూడా ఉన్నారని తెలిపారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు జిల్లాలోని వైద్యులందరూ సహకరించాలని, అత్యవసరంగా రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


మంటలు చెలరేగడానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ కంటైనర్ నుండి ఉద్భవించిందని అందుకే మంటలు ఇతర కంటైనర్లకు త్వరగా వ్యాపించిందని అనుమానిస్తున్నామని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. 2020ల , చిట్టగాంగ్‌లోని పటేంగా ప్రాంతంలోని కంటైనర్ డిపోలో ఆయిల్ ట్యాంక్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు.


Read also: Madurai Worker Killed: బతికుండగానే డ్రైనేజీలో పూడ్చేశారు.. తమిళనాడులో ఘోరం


Read also: Kakinada Rape Incident: కరోనా మందు పేరుతో మత్తు మందు ఇచ్చి.. బాలికపై హాస్టల్ కరస్పాండెంట్ రేప్..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook