Mecca Hajj Tragedy: మక్కా హజ్ యాత్రలో ఘోర విషాదం, ఎండ వేడిమికి 9 వందల మంది మృతి, 68 మంది భారతీయులు కూడా
Mecca Hajj Tragedy: పవిత్ర మక్కా హజ్ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సలసలకాగుతున్న ఎండలు, వడదెబ్బ కారణంగా హజ్ యాత్రికులు పిట్టల్లా రాలిపోతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mecca Hajj Tragedy: ఈ ఏడాది హజ్ యాత్ర అంతా సవ్యంగా సాగిపోతుందనుకున్న తరుణంలో హజ్ యాత్రికులు ప్రకృతి ప్రకోపానికి బలవుతున్నారు. తీవ్రమైన ఎండలు, వడదెబ్బ కారణంగా యాత్రికుల ప్రాణాలు పోతున్నాయి. ఎండ వేడిమికి అనారోగ్యానికి గురై మరణిస్తున్నారు.
మక్కా హజ్ యాత్రలో ఘోరం జరిగింది. మక్కా చుట్టుపక్కల ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 50-52 డిగ్రీలకు చేరుకోవడంతో పాటు వడగాల్పులు తీవ్రమయ్యాయి. దాంతో వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం కనీసం 9 వందలమంది మృతి చెందినట్టు తెలుస్తోంది. కాబాలో నిన్న 51.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు సమాచారం. హజ్ యాత్రికుల మరణాలపై సౌదీ అరేబియా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ జోర్డాన్, ట్యునీషియా దేశాలు మాత్రం తమ యాత్రికుల మరణాలను ధృవీకరించాయి.
9 వందలమంది మృతి, 68 మంది భారతీయులు
ప్రతి యేటా బక్రీద్ సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ముస్లింలు హజ్ యాత్ర జరుపుకుంటారు. ఈ ఏడాది మొత్తం 18.3 లక్షలమంది హజ్ యాత్రలో పాల్గొనగా అందులో విదేశీయులు 16 లక్షలమంది ఉన్నారు. నిన్న మక్కాలోని మెడికల్ కాంప్లెక్స్ వద్ద ప్రకటించిన మృతుల జాబితాలో అల్జీరియా, ఈజిప్టుతో పాటు ఇండియాకు చెందినవారి పేర్లు కూడా ఉన్నాయి. మరణాల సంఖ్యపై కచ్చితమైన సమాచారం తెలియడం లేదు. ఎండల తీవ్రత, వేడి గాలుల కారణంగా ఇప్పటి వరకూ 9 వందలమంది మరణించి ఉండవచ్చని అంచనా. ఇందులో 68 మంది భారతీయులున్నట్టు సమాచారం అందుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook