దలైలామాను కలవద్దు.. అది నేరం..!
చైనా కమ్యూనిస్ట్ పార్టీ యునైటెడ్ ఫ్రంట్ వర్క్ ఎగ్జిక్యూటివ్ వైస్ మినిస్టర్ జాంగ్ యిజియాంగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "దలైలామా ఒక వేర్పాటువాది, అలాంటి వ్యక్తిని ఏ దేశమైనా కలవడానికి ప్రయత్నిస్తే, దానిని మేము నేరంగానే పరిగణిస్తాం" అని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచ దేశాలన్ని టిబెట్‌ను చైనాలో భాగంగానే చూడాలని ఆయన కోరారు. దలైలామా 1959లో చైనా పట్ల వ్యతిరేకతను కనబరుస్తూనే, టిబెట్‌కు పారిపోయారని, అలాంటి వ్యక్తిని కలవడం అంటే చైనా సెంటిమెంట్‌ను కాలరాయడమేనని ఆయన పేర్కొన్నారు.
దలైలామాను ఒక మతగురువుగా భావిస్తూ, ప్రపంచ నేతలెవరైనా మాట్లాడినా సరే.. తాము ఖండిస్తామని ఆయన తెలిపారు. దలైలామా మతమనే ముసుగు తొడుక్కున్న ఒక రాజకీయవాది అని, చైనాను టిబెట్ నుండి వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయన తెలిపారు. చైనా ఇప్పటికి అనేకసార్లు ప్రపంచ నేతలు దలైలామాను కలవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
దలైలామా అనేది బౌద్ధ మతగురువులకు గురు శిష్య పరంపరలో లభించే ఒక బిరుదు. 1933లో 13వ దలైలామా మరణించాక లామోస్ తొండస్ 14వ దలైలామాగా పట్టాభిషక్తుడయ్యాడు.
చైనా టిబెట్‌ని ఆక్రమించి, అక్కడ నుంచి దలైలామాని వెళ్ళగొట్టడంతో 1959 నుండీ ఈయన భారతదేశంలో శరణార్ధిగా ఉంటున్నాడు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈయన భవనం ఉంది. ఆ ఆవరణలో ఉండే ఆలయంలో భక్తులకు దర్శనం ఇస్తుంటాడు. దలైలామాలంతా బుద్ధుని అంశ అయిన అవలోకేశ్వరుని పునర్జన్మలని బౌద్ధుల నమ్మకం