Memory Loss: మనలో చాలా మందికి మతిమరుపు ఉంటుంది. వస్తువును ఒక చోట పెట్టి..మరో చోట వెతుకుతుంటాం. తీరా గుర్తుకు వచ్చాక సమస్యను పరిష్కరించుకుంటాం. ఐతే ఐర్లాండ్‌లో ఓ వ్యక్తికి పడక గదిలో మతి మరుపు వచ్చింది. ఇదేంటని అనుకుంటున్నారా..ఐతే ఈస్టోరీని చూడండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐర్లాండ్‌కు చెందిన 66 ఏళ్ల వ్యక్తి, తన భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. వారి జీవితం అన్యోన్యంగా కొనసాగుతోంది. ఈక్రమంలో ఓ రోజున అతడు.. భార్యతో శృంగారం చేసిన కాసేపటికే మెమోరి లాస్‌ అయ్యింది. తన మొబైల్‌లో తేదిని చూసుకుని షాక్‌కు గురైయ్యాడు. ముందు రోజు తన పెళ్లి రోజు కదా..అదెలా మర్చిపోయానంటూ భార్యతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఇంట్లోని వారంతా అవాక్ అయ్యారు.  


అసలు విషయం ఏమిటంటే అప్పటికే వారి ఇంట్లో పెళ్లి రోజు వేడుక వైభవంగా సాగింది. ఈ విషయాన్ని అతడికి చెప్పినా ఇదంతా తనకు తెలియదని అన్నాడు. ఈ ఘటనను తన భర్త ఎలా మరిచిపోయాడోనని భార్య సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. పెళ్లి రోజు వేడుకను పదే పదే చెప్పినా ..అతడిలో స్పందన కరువైంది. ఐతే తన పేరు, వయసు, మరికొన్ని విషయాలను గుర్తు పెట్టుకున్న ఆ వ్యక్తి.. ఇవన్నీ మరిచిపోవడం ఏంటని కుటుంబసభ్యులు చెబుతున్నారు.


వెంటనే అతడిని వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. వ్యక్తిని పరిశీలించి ప్రమాదమేమి లేదని తేల్చేశారు డాక్టర్లు. ఇది స్వల్పకాలిక మతిమరుపు అని చెబుతున్నారు. దీనిని ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీషియా అంటారని వైద్యులు అంటున్నారు. ఈ ప్రభావం 50 నుంచి 70 ఏళ్ల వయసు వారిలో ఉంటుందని తెలిపారు. 2015లోనూ ఆ వ్యక్తి టీజీఏ ప్రభావానికి లోనయ్యారని ఐరిష్ జర్నల్ వివరించింది. అప్పుడు సైతం శృంగారం తర్వాతే మతిమరుపు వచ్చిందని వెల్లడించారు.


Also read: Southwest Monsoon: భారత్‌ను పలకరించిన నైరుతి రాగం..త్వరలో భారీ వర్షాలు..!


Also read:Nepal Plane Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్ విషాదాంతం..? పర్వత ప్రాంతంలో కూలిపోయినట్లు అనుమానాలు   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook