Mexico Bus Crash News Update: పశ్చిమ మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నయరిట్‌ రాష్ట్రంలో ప్రయాణికులతో వెళుతున్న బస్సు హైవే నుంచి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 18 మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారు మరణించారా..? లేదా గాయపడ్డారా..? అనే విషయం తెలియాల్సి ఉంది. గాయపడిన వారి పరిస్థితి నిలకడగా ఉందని నయారిత్ రాష్ట్ర భద్రత, పౌర రక్షణ కార్యదర్శి జార్జ్ బెనిటో రోడ్రిగ్జ్ తెలిపారు. లోయ దాదాపు 50 మీటర్లు (164 అడుగులు) లోతులో ఉన్నందున సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్కడి కాలమాన ప్రకారం గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 40 మంది ప్రయాణికులతో టిజువానా వైపు వెళ్తున్న బస్సు.. లోయలోకి ఎలా పడిపోయిందో కారణం ఏంటో స్పష్టంగా తెలియలేదని ఆయన అన్నారు. ప్రయాణికులలో ఎక్కువ మంది విదేశీయులు, వారిలో కొందరు యూఎస్‌ సరిహద్దుకు వెళ్లే వారు ఉన్నట్లు తెలిపారు. బస్సును రోడ్డు మలుపులో వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నట్లు చెప్పారు. అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. 


ప్రస్తుతం మృతులను గుర్తించే పనిలో ఉన్నామని అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన  22 మందిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించామన్నారు. వీరిలో ఒక మహిళ పరిస్థితి విషయంగా ఉందని చెప్పారు. రాష్ట్ర రాజధాని టెపిక్‌కు సమీపంలో హైవేపై బర్రాంకా బ్లాంకా సమీపంలో ఈ ఘోర ప్రమాదం ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు ఎలైట్ ప్యాసింజర్ లైన్‌కు చెందినదిగా గుర్తించారు. 


కాగా.. గత నెలలో కూడా మెక్సికోలో ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో జరిగిన బస్సు ప్రమాదంలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు ఫిబ్రవరిలో దక్షిణ, మధ్య అమెరికా నుండి వలస వచ్చిన వారిని తీసుకువెళుతున్న బస్సు సెంట్రల్ మెక్సికోలో క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు.


Also Read: Ind Vs WI 1st T20I Match Highlights: తొలి టీ20 విండీస్‌దే.. మ్యాచ్‌ గతిని మార్చేసిన ఆ ఒక్క ఓవర్‌..!  


Also Read: CM KCR: ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. పీఆర్‌సీ, ఐఆర్ ప్రకటన  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి