Bus Accident News: 80 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 29 మంది మృతి
Mexico Bus Accident: 80 అడుగుల లోయలోకి బస్సు దూసుకెళ్లడంతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది క్షతగాత్రులయ్యారు. మెక్సికోలోని మెక్సికోలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. పూర్తి వివరాలు ఇలా..
Mexico Bus Accident: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లోయలో బస్సు పడిపోవడంతో ఇప్పటివరకు 29 మంది మరణించగా.. 19 మంది గాయపడ్డారు. దక్షిణ మెక్సికోలో ప్రయాణికుల బస్సు అదుపు తప్పి దాదాపు 80 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపనట్లు అధికారులు వెల్లడించారు. ఓక్సాకా రాష్ట్రంలోని మాగ్డలీనా పెనాస్కో పట్టణానికి మిక్స్‌టెకా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలంలోనే 27 మంది మృతి చెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు.
బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో లోయలోకు దూసుకువెళ్లినట్లు ఓక్సాకా రాష్ట్ర అంతర్గత కార్యదర్శి జెసస్ రొమెరో వెల్లడించారు. డ్రైవర్‌కు పూర్తిగా నైపుణ్యం లేకపోవడం.. అలసట కారణంగా ప్రమాదం సంభవించినట్లు కనిపిస్తోందన్నారు. బస్సు మెక్సికో సిటీ నుంచి పూర్ మిక్స్‌టెకా ప్రాంతంలోని మారుమూల పర్వత గ్రామాలకు వెళుతున్న క్రమంలో ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. ఘటనా స్థలంలో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. బస్సును నడుపుతున్న సంస్థ మెక్సికో సిటీ నుంచి రోజువారీ సేవలను అందిస్తోందన్నారు.
ఓక్సాకా స్టేట్ ప్రాసిక్యూటర్ బెర్నార్డో రోడ్రిగ్జ్ అలమిల్లా మాట్లాడుతూ.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం ప్రాంతంలోని వివిధ ఆసుపత్రులకు తరలించామని చెప్పారు. మెకానికల్ వైఫల్యం కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా సంకేతాలు ఉన్నాయన్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. బస్సు ప్రమాదానికి సంబంధించిన చిత్రాలను పోలీసులు విడుదల చేశారు.
ఈ ఘోర ప్రమాదంపై ఓక్సాకా రాష్ట్ర గవర్నర్ సాలోమన్ జారా స్పందించారు. మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగ్డలీనా పెనాస్కోలో జరిగిన ప్రమాదంపై తాము తీవ్రంగా చింతిస్తున్నామని అన్నారు. సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పనిచేస్తున్నారని.. గాయపడిన వారికి అన్ని సహాయాలు అందిస్తున్నారని చెప్పారు. కాగా.. మెక్సికోలో వరుస ప్రమాదాలు అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
సెంట్రల్ స్టేట్ క్వెరెటారోలోని హైవేపై బుధవారం కార్గో వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో 8 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మే నెలలో నయారిట్ రాష్ట్రంలో బస్సు లోయలో పడటంతో కనీసం 18 మంది మెక్సికన్ పర్యాటకులు మరణించారు. అదే నెలలో తమౌలిపాస్‌లోని హైవేపై ప్రయాణీకుల వ్యాన్, సెమీ ట్రక్కు ఢీకొన్న ఘటనలో 13 మంది మృతి చెందారు.
Also Read: IND Vs WI T20 Squad: టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా.. తెలుగు కుర్రాడికి చోటు
Also Read: Salaar Teaser: సలార్ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook