అమెరికాలో దారుణం జరిగింది. అక్కను సొంత తమ్ముడే కాల్చి చంపాడు. ఈ ఘటన దక్షిణ అమెరికాలోని మిస్సిసీపీ రాష్ట్రంలో గత శనివారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


వీడియో గేమ్ కోసం ఆ అక్కా (13 ఏళ్లు), తమ్ముడు (9 ఏళ్లు) గొడవ పడ్డారు. స్థానిక మీడియా కథనం మేరకు బాలిక వీడియో గేమ్ కంట్రోలర్ ను తమ్ముడికి ఇచ్చేందుకు నిరాకరించింది. తాను ఆడుకుంటున్నాననీ, తరువాత తీసుకోవాలని చెప్పింది. అయితే ఆ తమ్ముడు అక్క మాటలు వినలేదు. అంతే తుపాకీ తీసుకుని అక్కను కాల్చి చంపేశాడు. బాలుడు వెనుక నుంచి తుఫాకీతో కాల్చడంతో బుల్లెట్‌ ఒక్కసారిగా బాలిక మెదడులోకి దూసుకెళ్లింది. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న టెన్నెసీలోని మెంఫిస్‌ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందింది.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.