Model Teddy Quinlivan hits Audience With Coat: మోడలింగ్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిఒక్క మోడల్ తెరవెనక ఎన్నో కష్టాలు పడి ర్యాంప్ వాక్ చేస్తూ ఉంటారు. ఎంతో అందంగా, ఫిట్‌గా కనిపించేందుకు మోడల్స్ ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. అలాంటి వారు ర్యాంప్ వాక్ చేస్తున్న సమయంలో కామెంట్ చేస్తే ఆగ్రహానికి గురవుతారు. అలాంటి ఘటనే న్యూయార్క్‌లో జరిగింది. ఓ ఫ్యాషన్ మోడల్ ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తూ.. ఆడియెన్స్‌ని కోటుతో కొట్టింది. విషయంలోకి వెళితే... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెప్టెంబర్ 2021లో న్యూయార్క్‌లో ఓ ఫ్యాషన్ షో జరిగింది. ఆ షోలో అమెరికాకు చెందిన మోడల్ థియోడోరా టెడ్డీ క్విన్లివాన్ పాల్గొంది. డిజైనర్ క్రిస్టన్ కోవన్ తయారు చేసిన డ్రెస్ డిజైన్‌ను ప్రదర్శించింది. ఈ క్రమంలో ర్యాంప్ పైకి నాలుగు అడుగులు వేసిన థియోడోరా.. ఆడియన్స్ దగ్గరకు రాగానే తన చేతితో ఈడ్చుకొస్తున్న కోటుతో ఒకరిని కొట్టింది. ఆ తర్వాత తాను ఏమీ చెయ్యనట్టు ర్యాంప్ వాక్ చేస్తూ వెళ్లిపోయింది. అయితే ఆ మోడల్ ఆడియన్‌ని కొట్టడానికి ఓ కారణం ఉందట. 


థియోడోరా టెడ్డీ క్విన్లివాన్ ర్యాంప్ వాక్ చేస్తున్నప్పుడు షోకి హాజరయిన ఆడియన్స్ ఎగబడి మరీ తమ మొబైల్‌లో ఆమెను వీడియో తీస్తున్నారు. అంతేకాకుండా ఆమెను ఎగతాళి చేస్తూ అరిచారు. దాంతో మోడల్ థియోడోరాకు ఒక్కసారిగా కోపం వచ్చింది. అందుకే వీడియో రికార్డ్ చేస్తున్న ఓ ఆడియన్‌ని థియోడోరా కోటుతో కొట్టినట్లు సమాచారం తెలుస్తోంది. ర్యాంప్ వాక్‌లో అలా కొట్టడం కూడా భాగమే అని ఇంకొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీడియో పాతదే అయినా ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. 



డిఫెనూడుల్స్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోని థియోడోరా టెడ్డీ క్విన్లివాన్ డిజైనర్ క్రిస్టియన్ కోవాన్ కూడా షేర్ చేశారు. థియోడోరా చేసిన పనిని ఆమె సమర్థించారు. కారెన్స్ ప్రపంచంలో థియోడోరా లాగానే ఉండాలని క్యాప్షన్ ఇచ్చారు. థియోడోరా 2017లో మొదటి ఓపెన్ ట్రాన్స్ జెండర్ మోడల్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు ఇన్‌స్టాలో 1.34 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. థియోడోరా పోస్టుల్లో చాలావరకూ వివాదాస్పదమైనవే ఉన్నాయి. 


Also Read: IND vs WI: ఇంగ్లండ్‌ను ఓడించాం.. తర్వాత టీమిండియానే! విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!!


Also Read: Covid 19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరించిన 65 ఏళ్ల వ్యక్తి.. కారణం ఏం చెప్పాడో తెలుసా? నవ్వులే పో!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook