Monkeypox cases touches to 120 in globally, WHO calls for emergency meet: ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారితో సతమతం అవుతున్న ప్రపంచ ప్రజలను మరో వైరస్ భయాందోళనలకు గురిచేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలను 'మంకీపాక్స్' వైరస్ కలవరపెడుతోంది. బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈ వైరస్.. నెమ్మనెమ్మదిగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే 120కి పైగా కేసులు నమోదయ్యాయి. మరిన్ని కేసులు పరిశీలనలో ఉన్నాయి. దాంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మే 7న బ్రిటన్‌లో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్‌ను కనుకున్నారు. నైజీరియా నుంచి బ్రిటన్‌కు వచ్చిన వ్యక్తిలో వైరస్ బయటపడింది. అప్పటినుంచి బ్రిటన్‌లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా 20కి చేరుకుంది. స్పెయిన్‌లోనూ ఇప్పటివరకు 23 కేసులు వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్‌, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికాలో మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కూడా ఈ జాబితాలో చేరిపోయాయి.


మంకీపాక్స్ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూఎచ్ఓ) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మంకీపాక్స్ వ్యాధి విస్తరణ, నివారణపై చర్చించింది. పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని, మంకీపాక్స్ కేసులు మరిన్ని వెలుగుచూసే అవకాశం ఉందని డబ్ల్యూఎచ్ఓ అంచనా వేస్తోంది. ఎపిడెమియోలాజికల్ పరిశోధనలు కొనసాగుతున్నాయని, స్వలింగ సంపర్కులకే ఎక్కువగా ఈ వైరస్ సోకుతుందని తెలిపింది. ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూఎచ్ఓ హెచ్చరించింది. భారత ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. 


ఏంటీ ఈ మంకీపాక్స్:
మంకీపాక్స్ ఒక వైరల్‌ వ్యాధి. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. తుంపర్ల ద్వారా లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముంది. వ్యాధి సోకిన జంతువు కరిచినా ఇది సోకుతుంది. వ్యాధి సోకిన జంతువుల మాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా ఈ వ్యాధి అంటుకొనే ప్రమాదం ఉంది. శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుందని సమాచారం. ఇక మంకీపాక్స్ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే 'మంకీపాక్స్' అని పేరు పెట్టారు. 1970ల్లో తొలిసారి మనుషుల్లో ఇది బయటపడింది.


మంకీపాక్స్ ​లక్షణాలు:
జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీపాక్స్ ​లక్షణాలు. చికెన్ పాక్స్‌ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి ఈ బొబ్బలు శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ లక్షణాలు 14-21 రోజుల్లో బయటపడతాయి. అయితే మైల్డ్​ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది 5-7 రోజుల్లో కోలుకుంటారు. 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారుతుందని వివేదికలు చెబుతున్నాయి. మశూచి టీకాలే మంకీపాక్స్‌ నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి.


Also Read: Telangana Weather Forecast: తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు.. కోటిపల్లిలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం!


Also Raed: Fuel Prices: ఇంధన ధరల్ని కేంద్రంతో పాటు తగ్గించిన రాష్ట్రాలు, పెట్రోల్-డీజిల్ ధరలు ఏ నగరంలో ఎంత..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook