Morocco Earthquake Today: ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశంలో అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం ఏర్పడి భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఇప్పుటి వరకు దాదాపుగా 300 మంది మృతి చెందినట్లు అధికారులు అంచనా వేశారు. భూకంప ధాటికి పెద్ద ఎత్తున ఇళ్లు కూలిపోయాయి. ఆ శిథిలాల కింద ప్రజలు కూరుకుపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. మిడ్ నైట్ ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇలాంటి బలమైన భూకంపం సంభవించడం వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మొరాకోలోని మరాకేష్ నగరానికి 71 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. భూమికి దాదాపు 18.5 కిలో మీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారుల చెబుతున్నారు. 


ఎలా జరిగింది?
స్థానిక కాలమాన ప్రకారం అర్ధరాత్రి 11 గంటల తర్వాత భూ ప్రకంపనులు సంభవించినట్లు అక్కడి ప్రజలు వెల్లడించారు. భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న మరకేష్ నగరంలో పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. పెద్ద ఎత్తున ఆస్తులతో పాటు కార్లు వంటి వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. అంతటి విపత్తు తర్వాత రెస్క్యూ టీమ్ తో పాటు స్థానికులు సహాయక చర్యలను చేపట్టారు. ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దృశ్యాల ప్రకారం.. మొరాకోలో భూకంపం సంభవించిన వెంటనే స్థానికుల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. ప్రజలు ఇళ్లను వదిలి వీధుల్లోకి వచ్చారు. స్థానికులు మాట్లాడుతూ.. భూకంపానికి ముందు వీధుల్లో పెద్దఎత్తున అంబులెన్స్ లు కనిపించాయని అన్నారు. కూలిపోయిన భవనాల శిథిలాల కింద చాలా మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. 








Also Read: Chandrababu Arrest Updates: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్, కేసు పరిణామాలిలా


ప్రధాని మోదీ సంతాపం
మొరాకో భూకంపంలో మరణించిన వారి కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలియజేశారు. మొరాకో ప్రజలకు అన్ని విధాలా సహాయం చేయడానికి భారత దేశం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. 


గత 120 ఏళ్లలో ఆ ప్రాంతంలో ఇంతటి తీవ్రత కలిగిన భూకంపం రావడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు భూ ప్రకంపనలు వచ్చినా.. అవి తూర్పు ప్రాంతాల్లోనే సంభవించాయి. అంతటి తీవ్ర వైపరిత్యం తర్వాత ప్రజల కంటి మీద కునుకు లేకుండా పోయింది.


Also Read: Chandrababu Arrest: నంద్యాలలో చంద్రబాబు అరెస్టు, రాష్ట్రవ్యాప్తంగా బస్సులకు బ్రేక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook