బిగ్ బ్రేకింగ్: భారత్ కు బయలుదేరిన ట్రంప్, ఇదిగో వీడియో
ఎంతో ఆసక్తిగా కనబరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన కాసేపటి క్రితం ప్రారంభమైంది. సతీసమేతంగా ఎయిర్‌ఫోర్స్ 1 విమానంలో ఆయన వాషింగ్టన్ డీసీ నుంచి పయనమయ్యారు.
న్యూఢిల్లీ: ఎంతో ఆసక్తిగా కనబరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన కాసేపటి క్రితం ప్రారంభమైంది. సతీసమేతంగా ఎయిర్‌ఫోర్స్ 1 విమానంలో ఆయన వాషింగ్టన్ డీసీ నుంచి పయనమయ్యారు. వారి వెంట కూతురు ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్ కూడా భారత్ కు రానున్నారు.
జర్మనీ మీదుగా వారు భారత్‌కు చేరుకుంటారని, రేపు (సోమవారం) ఉదయం 11.55 నిముషాలకు ట్రంప్ ఫ్యామిలీ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుందని అమెరికా హై కమిషనేర్ కార్యాలయ సిబ్బంది తెలిపింది. అహ్మదాబాద్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అగ్రరాజ్య అధ్యక్షుడికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతారని, ఎయిర్‌పోర్టు నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతేరా క్రికెట్ స్టేడియం వరకు ఇరు దేశాల అధినేతలు రోడ్ షోలో పాల్గొంటారని జాతీయ రక్షణ మండలి తెలిపింది.
లక్షలాది నమస్తే ట్రంప్ అంటూ స్వాగతం పలికేలా ఏర్పాట్లతో పాటు, కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేశామని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..