Nepal Plane Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్ విషాదాంతం..? పర్వత ప్రాంతంలో కూలిపోయినట్లు అనుమానాలు
Nepal Plane Missing: నేపాల్‌కి చెందిన ఓ విమానం అదృశ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. విమానంలో నలుగురు భారతీయులు సహా 22 మంది ఉన్నారు.
Nepal Plane Missing: నేపాల్‌లో తారా ఎయిర్ మిస్సింగ్ విమాన ఘటన విషాదంతమైనట్లుగా కథనాలు వస్తున్నాయి. ఈ విమానం దౌలగిరి ప్రాంతంలోని పర్వతాల్లో కుప్పకూలి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆదివారం ఉదయం భారీ శబ్దాలు వినిపించడమే ఇందుకు కారణం. ఆదివారం (మే 29) ఉదయం నేపాల్‌లోని పొఖారా నుంచి జోమ్సమ్ ప్రాంతానికి 22 మంది ప్రయాణికులతో ఈ విమానం బయలుదేరింది. ఆ తర్వాత కొద్దిసేపటికే విమానం అదృశ్యమైంది. విమానం రాడార్ సిగ్నల్స్ పూర్తిగా తెగిపోయాయి.
విమానంలో ఉన్న 22 మంది ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు, ఇద్దరు జర్మన్లు, 13 మంది నేపాలీ ప్యాసింజర్లు, ముగ్గురు నేపాలీ కేబిన్ క్రూ ఉన్నట్లు చెబుతున్నారు. ఉదయం 9.55గం. సమయంలో విమానం నుంచి సిగ్నల్స్ పూర్తిగా తెగిపోయాయి. ఉదయం 10.15 గంటలకు ఈ విమానం జోమ్సమ్ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. చివరిసారిగా ముస్తాంగ్ జిల్లాలో విమానం కనిపించగా.. అక్కడి నుంచి మౌంట్ దౌలగిరి వైపు మళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత విమానం ఆచూకీ తెలియకుండా పోయింది.
మిస్సింగ్ విమానం కోసం నేపాల్ మిలటరీ హెలికాప్టర్ ఎంఐ-17ని రంగంలోకి దింపారు. విమానం ప్రయాణించిన మార్గంలో ప్రస్తుతం ఈ హెలికాప్టర్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ ఉదయం భారీ శబ్దం వినిపించినట్లు ముస్తాంగ్ జిల్లాలోని టిటీ ప్రాంత వాసులు చెబుతున్నారు. దీంతో విమానం కూలిపోయి ఉండొచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికైతే విమానం ఆచూకీపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Also Read: Tirumala Rush: తిరుమలలో రికార్డు స్థాయిలో పోటెత్తిన భక్తులు, బ్రేక్ దర్శనాలు రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook