హిందూవుల ఆరాధ్య దైవం రాముని ( Sriram ) పై నేపాల్ ( Nepal ) మరోసారి వివాదం రేపింది. శ్రీరాముడి జన్మస్థలం ( Birth place of Rama ) విషయంలో నెల రోజుల క్రితం చేసిన వ్యాఖ్యల్నే మరోసారి చేశారు. రాముడు పుట్టింది నేపాల్ లోని అయోధ్యపురిలోనని..అయోధ్యలో కాదని అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రామ జన్మభూమిలో ( Ram janmabhoomi ) రామమందిరానికి భూమిపూజ జరిగినా...నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ( Nepal prime minister kp sharma oli ) వైఖరిలో మార్పురాలేదు. ఇంకా అవే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. నెల రోజుల క్రితం చేసిన వ్యాఖ్యల్నే మరోసారి చేశారు. రాముడి జన్మస్థలం దక్షిణ నేపాల్ లోని అయోధ్యపురి ( Ayodhya puri ) అని...ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య కాదని పేర్కొన్నారు. నెల రోజుల వ్యవధిలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. రాముడి జన్మస్థలాన్ని అభివృద్ది చేసేందుకు ప్రణాళికపై చర్చించారు. అయోధ్యపురిని శ్రీరాముని జన్మస్థలంగా ప్రచారం చేయాలని..రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరారు. మాడి మున్సిపాలిటీను అయోధ్యపురిగా మార్చాలని సైతం సూచించారు. 


కాగా..నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఈ వ్యాఖ్యలపై సొంతపార్టీలోనే వ్యతిరేకత ఎదురవుతోంది. రాముడి జన్మస్థలంపై ఓలి చేస్తున్న ప్రచారాన్ని మతపెద్దలు సైతం ఖండిస్తున్నారు. నేపాల్ మత బోధకుడు ఆచార్య దుర్గాప్రసాద్ గౌతమ్ ( Acharya Durga prasad goutham )...ప్రధాని ఓలి వ్యాఖ్యల్ని తోసిపుచ్చారు. ఇప్పుడు కేపీ శర్మ ఓలికు వ్యతిరేకంగా అంతర్గతపోరు పార్టీలో తీవ్రమైంది. Also read:Kerala Flight crash: ఆ రన్ వే సేఫ్ కాదని గతంలోనే హెచ్చరించారా