గత నెల రోజులుగా కరోనా వైరస్ దేశంలో కలకలం రేపుతోంది. వేలల్లో నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసులు 24 గంటల వ్యవధిలో 3.5 లక్షలు వరకు వస్తున్నాయి. కోవిడ్19 మరణాలు సైతం భారీగా నమోదవుతున్నాయి. భారత్‌లో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు ప్రపంచ దేశాలను సైతం వణికిస్తున్నాయి. భారత్ నుంచి తమ దేశంలోకి ఎవరైనా కరోనా వైరస్‌ను తీసుకొస్తారని ఆయా దేశాలు ఆందోళన చెందుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్ నుంచి విమానాల రాకపోకలు నిషేధిస్తూ నెదర్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల యూకే, న్యూజిలాండ్, యూఏఈ, ఫ్రాన్స్, కెనడా తదితర దేశాలు భారత్‌పై ట్రావెల్ బ్యాన్ విధించగా తాజాగా ఈ జాబితాలో నెదర్లాండ్ చేరిపోయింది. డచ్ విమానయాన మంత్రిత్వ శాఖ ఆదివారం నాడు ఓ ప్రకటన విడుదల చేసింది. నేటి (ఏప్రిల్ 26 నుంచి) భారత్ నుంచి విమానాల రాకపోకలపై మే 1 వరకు నిషేధం విధించింది. అయితే నిషేధం పొడిగించే అవకాశం ఉందని ప్రకటనలో పేర్కొన్నారు. భారత్‌లో కరోనా వైరస్(CoronaVirus) సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో తదుపరి ప్రకటన విడుదల చేసే వరకు విమానాలపై నిషేధం అమల్లో ఉంటుందని నెదర్లాండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. 


Also Read: Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 26, 2021, ఆ రాశి వారికి వాహనయోగం


‘సోమవారం (ఏప్రిల్ 26) సాయంత్రం 6 గంటల నుంచి భారత్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నాం. ప్రస్తుతానికి తాత్కాలికంగా మే 1 వరకు ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో మరికొన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నామని’ డచ్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌లో కరోనా కేసుల పరిస్థితిపై కేబినెట్ మీటింగ్ అనంతరం నెదర్లాండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 


భారత్‌లో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా మారిందని, తమ పౌరులను కరోనా బారిన పడకుండా రక్షించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పలు దేశాలు ఇదే తరహాలో ఆంక్షలు అమలు చేస్తున్నాయని గుర్తుచేశారు. కార్గో విమానాలు, మెడికల్ కిట్స్, వైద్యానికి సంబంధించిన పరికరాల ఎగుమతి, దిగుమతి చేసే విమానాలకు ఈ ఆంక్షల నుండి మినహాయింపు ఇచ్చారు. నిన్న 3.49 కరోనా కేసులు నమోదు కాగా, 2,767 మంది కోవిడ్19(COVID-19) బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.


Also Read: Vaccine Registration: 18 ఏళ్లు దాటినవారు వ్యాక్సిన్ కావాలంటే..రిజిస్ట్రేషన్ తప్పనిసర 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook