New coronavirus strain: శరవేగంగా కొత్త కరోనా వైరస్..ఎందుకింత భయానకం
New coronavirus strain: ఇంగ్లండ్‌లో కొత్త కరోనా వైరస్ భయపెడుతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో నమోదైన కేసుల సంఖ్య తెలిస్తే..పరిస్థితి తీవ్రత అర్ధమౌతుంది.
New coronavirus strain: ఇంగ్లండ్‌లో కొత్త కరోనా వైరస్ భయపెడుతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో నమోదైన కేసుల సంఖ్య తెలిస్తే..పరిస్థితి తీవ్రత అర్ధమౌతుంది.
కరోనా కొత్త రకం వైరస్ ( Corona new strain ) ప్రపంచాన్ని వణికించే దిశగా విస్తరిస్తోంది. ఊహించినట్టే శరవేగంగా వ్యాపిస్తూ కలవరం కల్గిస్తోంది. బ్రిటన్‌లో ప్రారంభమై..మిగిలిన దేశాలకు విస్తరిస్తున్న వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు భయం గుప్పిట్లో బతుకుతున్నాయి. అటు ఇంగ్లండ్ ( England )లో వేగంగా సంక్రమిస్తున్న కేసుల సంఖ్య ఆందోళన కల్గిస్తోంది. నేషనల్ హెల్త్ సర్వీసెస్ ( National Health Services ) గణాంకాల ప్రకారం..డిసెంబర్ 10 నుంచి 16 వతేదీ మధ్య కాలంలో అంటే కేవలం వారం రోజుల వ్యవధిలో 1 లక్షా 73 వేల 875 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
తదుపరి వారంలో అంటే డిసెంబర్ 17 నుంచి 25 మధ్యకాలంలో 2 లక్షల 75 వేల కేసులు నమోదయ్యాయి. వారం వారం కేసుల సంఖ్య వేగం కన్పిస్తోంది. కేవలం వారం రోజుల్లోనే రికార్డు సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కరోనా పాత వైరస్ కూడా ఇంత వేగంగా విస్తరించలేదంటున్నారు నిపుణులు. వేల్స్‌లో ప్రతి 60 మందిలో ఒకరికి కరోనా కొత్త వైరస్ ( New coronavirus ) సోకితే..ఇంగ్లండ్ దేశవ్యాప్తంగా ప్రతి 85 మందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. నియంత్రించేందుకు టైర్ 4 ఆంక్షల్ని అమల్లో తీసుకొచ్చింది దేశం.
శరవేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వైరస్ నేపధ్యంలో రాణి ఎలిజబెత్ 2 క్రిస్మస్ వేడుకల్ని ( Christmas celebrations ) కేవలం భర్త ఫిలిప్‌తో మాత్రమే కలిసి జరుపుకున్నారు. కుమారుడు ప్రిన్స్ ఛార్లెస్, మనవడు విలియమ్స్ ఇంటికే పరిమితమయ్యారు. ఇక దక్షిణాఫ్రికాలో 501.వీ2 అనే మరో కొత్త వేరియంట్ అతి ప్రమాదకరమని..మరింత వేగంతో వ్యాపించే అవకాశాలున్నాయని బ్రిటీషు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
బ్రిటన్ ( Britain ) కరోనా వైరస్ నేపధ్యంలో అమెరికాలో కొత్త ఆంక్షలు విధించారు. కరోనా నెగెటివ్ తేలితేనే దేశంలో అనుమతి లభిస్తోంది. విమాన ప్రయాణానికి మూడ్రోజుల ముందే పరీక్షలు చేయించుకుని..సంబంధిత రిపోర్టును విమానయాన సంస్థకు అందించాలని అమెరికా స్పష్టం చేస్తోంది.
Also read: New coronavirus symptoms: ఆ లక్షణాలుంటే అది కొత్త రకం కరోనా వైరస్‌నే..ఇవే ఆ లక్షణాలు