New Year 2021 Celebrations:  బైబై 2020.. మరో సంవత్సర కాలం గడిచిపోయింది. మరో దశాబ్దం కనుమరుగైంది. అప్పుడే కొత్త సంవత్సరం మొదలైంది. న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమయ్యాయి. కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్‌కమ్ చెబుతున్నారు న్యూజిలాండ్ వాసులు. బాణాసంచా కాల్చి ఆక్లాండ్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. పాత సంవత్సారానికి గుడ్ బై చెబుతూ న్యూ ఇయర్ 2021కి స్వాగతం పలుకుతూ ప్రజలు కేరింతలు కొడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 పసిఫిక్ మహాసముద్రంలోని సమోవా ద్వీపం అందరికంటే ముందుగా 2021 ఏడాదికి స్వాగతం పలికింది. అనంతరం కిరిబాటి, టోంగా దీవులు సైతం కొత్త ఏడాదిలో అడుగుపెట్టాయి. అనంతరం న్యూజిలాండ్ సైతం కొత్త ఏడాదిని ప్రారంభించింది. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టగానే అక్కడ సంబరాలు మిన్నంటాయి. భారత కాలమానం ప్రకారం ఇక్కడ సాయంత్రం 4.30 గంటలకు న్యూజిలాండ్‌ 2021లోకి అడుగుపెట్టింది. సంబరాల వీడియో ఏఎన్ఐ పోస్ట్ చేసింది. 


Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!


 



 


చివరగా ఎక్కడంటే... 
నూతన సంవత్సరం ఆలస్యంగా మొదలయ్యే ఆసియా దేశాలలో భారత్ ఒకటి. కాగా, భారత్ తర్వాత అయిదున్నర గంటలకు ఇంగ్లాండ్‌లో నూతన సంవత్సరం మొదలవుతుంది. మనకు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అమెరికాలోని న్యూయార్క్ తొలుత కొత్త ఏడాదికి అడుగుపెట్టనుంది. చివరిగా అమెరికా పరిధిలోకి వచ్చే హోవార్డ్, బేకర్ దీవులు కొత్త ఏడాదికి స్వాగతం చెబుతాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook