Social Media Hazard: సోషల్ మీడియా అనేది విష పదార్థం.. తుపాకీ కన్నా ప్రమాదకరం
Public Health Hazard: ప్రపంచమే మన అరచేతిలో పట్టేలా చేసింది మొబైల్ ఫోన్. ఇక మనిషికి వినోదం.. టైంపాస్ చేసేలా సోషల్ మీడియా దోహదం చేస్తుంది. మనిషి విలువైన సమయాన్ని సామాజిక మాధ్యమాలు మింగేస్తున్నాయి. మహమ్మారి కరోనా విజృంభణ అనంతరం వాటి వాడకం మరింత ప్రమాదకరంగా మారింది. ఇది గ్రహించిన ఓ నగరం సామాజిక మాధ్యమాలను నిషేధిత జాబితాలో చేర్చింది. సోషల్ మీడియా కూడా ఒక వ్యసనంగా ప్రకటించింది.
Social Media As Toxic: ప్రస్తుతం మనం కొన్ని నిమిషాల పాటు సోషల్ మీడియాను వదిలి ఉండలేం. మన జీవితంలో సామాజిక మాధ్యమాలు కూడా ఒక అవసరంగా మారాయి. అవి లేకుండా రోజు కాదు కదా ఒక్క పూట కూడా గడవని పరిస్థితికొచ్చింది. దీంతో ప్రజల విలువైన సమయం వాటికి అంకితమవుతోంది. అయితే ఇది కొందరికి మరీ వ్యసనంలా మారుతోంది. ఇది గ్రహించిన ఒక నగరం ఏకంగా సోషల్ మీడియానే నిషేధించింది. వాటిని నిషేధిత జాబితాలో చేరుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ నిషేధాన్ని న్యూయార్క్ నగరం తీసుకుంది. ధూమపానం ఎలా వ్యసనమో అదే రీతిన సోషల్ మీడియా కూడా వ్యసనంగా ఆ ప్రఖ్యాత నగరం గుర్తించింది. సోషల్ మీడియాను పర్యావరణ విష పదార్థంగా పరిగణించింది. ప్రజారోగ్యానికి ప్రమాదకరమని న్యూయార్క్ నగర పాలక సంస్థ ప్రకటించింది. ఈ మేరకు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. 'చిన్నారుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు రావడానికి టిక్‌టాక్, యూట్యూబ్, ఫేసుబుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ముఖ్య కారణం. వీటి వలన పదేళ్లలో యువతీయువకులు అత్యధికంగా కుంగుబాటు బారిన పడుతున్నారని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనిర్ణయం తీసుకున్నాం' అని మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు.
ఇక నగర ప్రజలకు మేయర్ ఆడమ్స్ ఒక పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాలు వినియోగిస్తున్న పిల్లలపై కుటుంబసభ్యులు దృష్టి సారించాలని.. వాటి వినియోగంపై ఓ కన్నసే ఉంచాలని సూచించారు. 'న్యూయార్క్‌లోని 77 శాతం విద్యార్థులు వారంలో రోజుకు మూడు గంటల కంటే ఎక్కువగా సామాజిక మాధ్యమాలు వాడుతున్నారని 2021 సర్వేలో తేలింది. ఇది హోంవర్క్ చేసే సమయం కన్నా అత్యధికంగా ఉంది. చిన్నారులను వ్యసనపరులుగా చేస్తున్నాయని చెప్పడానికి ఆ సర్వేనే ఉదాహరణ. పరిస్థితి ఇలాగే ఉంటే పిల్లల మానిసక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది' అని ఆడమ్స్ వివరించారు.
ధూమపానం, తుపాకీలను వైద్యులు అనారోగ్య కారణాలు భావిస్తున్నట్టే సామాజిక మాధ్యమాలను కూడా మేం అలానే భావిస్తున్నాం. సామాజిక మాధ్యమాలు హానికరం అని చెబుతున్నాం. యాప్స్ రూపొందిస్తున్న ఐటీ కంపెనీలే దీనికి బాధ్యత వహించాలి' అని ఎరిక్ ఆడమ్స్ స్పష్టం చేశారు. ఇంతలా న్యూయార్క్ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనకాల చాలా కారణమే ఉందని తెలుస్తోంది. న్యూయార్క్ ప్రజలు సోషల్ మీడియాకు బానిసలుగా మారారని చాలా సర్వేలు వెల్లడించాయి. విలువైన పనులను వదిలేసి మరి సామాజిక మాధ్యమాలకు అంకితమవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. న్యూయార్క్ నిర్ణయాన్ని పిల్లల తల్లిదండ్రులు ఆహ్వానిస్తున్నారు. ఇలాంటిది భారతదేశంలో కూడా అమలుచేయాలని మన భారతీయులు కూడా కోరుతున్నారు.
Also Read: Roja Counter to Sharmila: తెలంగాణ ప్రజలు ఛీ కొడితే షర్మిల ఏపీలో వాలింది: మంత్రి రోజా వ్యాఖ్యలు
Also Read Niharika Vs Chaitanya: నిహారిక ఇంటర్యూపై మాజీ భర్త చైతన్య స్పందన.. తనను నిందించొద్దని హితవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook