Newyork Shooting: జాతి విద్వేష కాల్పులు... అమెరికాలో అగంతకుడి కాల్పుల్లో 10 మంది మృతి
Newyork Shooting: అమెరికాలో మరోసారి జాతి విద్వేషం రగిలింది. ఓ శ్వేత జాతీయుడు తుపాకీతో సూపర్ మార్కెట్లోకి ప్రవేశించి కాల్పులకు పాల్పడ్డాడు. కాల్పుల్లో 10 మంది మృతి చెందారు.
Newyork Shooting: గన్ కల్చర్ ఎక్కువగా ఉండే అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. న్యూయార్క్‌లోని బఫెలో ప్రాంతంలో ఉన్న సూపర్ మార్కెట్‌లో ఓ అగంతకుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి సహా 11 మంది ఆఫ్రికన్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. 18 ఏళ్ల ఆ అగంతకుడు మిలటరీ దుస్తులు ధరించి గన్‌తో సూపర్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు వెల్లడించారు.
మొదట సూపర్ మార్కెట్ పార్కింగ్ ప్రదేశంలో కాల్పులు జరిపిన అగంతకుడు ముగ్గురిని కాల్చి చంపాడు. ఆ తర్వాత సూపర్ మార్కెట్ లోపలికి ప్రవేశించి మరికొందరిపై కాల్పులు జరిపాడు. తలకు హెల్మెట్ ధరించిన అతను.. దానికి ఉన్న కెమెరాతో కాల్పులను లైవ్ స్ట్రీమ్ చేసి ఉంటాడని అధికారులు వెల్లడించారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో నల్ల జాతీయుల ప్రాబల్యం ఎక్కువ. దీంతో జాతి విద్వేషం కారణంగానే ఈ కాల్పులు జరిగాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
కాల్పుల ఘటనపై బఫెలో మేయర్ బైరన్ బ్రౌన్ విచారం వ్యక్తం చేశారు. తమ కమ్యూనిటినీ ఇది తీవ్రంగా బాధించిన రోజు అని పేర్కొన్నారు. ఇలాంటి ఘటన ఏ కమ్యూనిటీకి జరగవద్దని అన్నారు. ఈ సమయాల్లో మృతుల కుటుంబాలు, తాము ఎదుర్కొంటున్న బాధ వర్ణనాతీతమని అన్నారు. న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచుల్ మాట్లాడుతూ... అగంతకుడిని శ్వేతజాతి దురహంకారిగా అభివర్ణించడం గమనార్హం. అతను తప్పక ఊచలు లెక్కబెడుతాడని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి