లండన్‌: అంతర్జాతీయ వైద్య సదస్సులో విషాదం చోటుచేసుకుంది. సదస్సులో పాల్గొనడానికి లండన్ వెళ్లిన నిమ్స్ డాక్టర్, సీనియర్ న్యూరాలజిస్ట్ ఏకే మీనా కుమారి కన్నుమూశారు. లండన్‌‌లో సదస్సులో ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ మీనా కుమారి ఒక్కసారిగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. విషమ పరిస్థితిలో ఉన్న ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డాక్టర్లు ఆంజియోప్లాస్టీ చేయడంతో పాటు మూడు స్టంట్లు వేసి ఆమెను బతికించేందుకు ప్రయత్నించారు. హార్ట్ ఎటాక్ నుంచి ఆమె తేరుకుంటుండగానే బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వైద్యులు వెంటిలేటర్ మీద ఆమెకు చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. సీనియర్ డాక్టర్, ప్రొఫెసర్ మీనా కుమారి తుదిశ్వాస విడిచారు. కాగా తమిళనాడుకు చెందిన మీనా కుమారి 25 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్నారు.


కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న డాక్టర్, న్యూరాలజీ ప్రొఫెసర్ మీనా కుమారి అనూహ్యంగా కుప్పకూలిపోయారని.. అనంతరం వైద్య చికిత్స అందిస్తుండగానే కన్నుమూశారని యూకే డిప్యూటి హై కమిషనర్‌ డా.ఆండ్రూ ఫ్లెమింగ్‌ ట్విట్టర్ ద్వారా తెలిపారు. నిమ్స్ డాక్టర్ మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సదస్సులో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లిన మీనా కుమారి ఆకస్మిక మరణంతో ఆమె కుటుంసభ్యులు, నిమ్స్‌ వైద్యులు, హాస్పిటల్ సిబ‍్బంది తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..