Nirav Modi: ప్రముఖ వజ్రాల వ్యాపారి, పీఎన్‌బీ స్కాం సూత్రధారి నీరవ్ మోదీ మరో డ్రామాకు తెరలేపాడు. ఇండియాకు అప్పగిస్తే ఆత్మహత్యే శరణ్యమంటూ వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు లండన్ కోర్టు నీరవ్ అప్పీల్‌ను తిరస్కరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ప్రముఖ బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారీ నీరవ్ మోదీ(Nirav Modi)..కేసుల్నించి తప్పించుకోవడమే ధ్యేయంగా డ్రామాలు కొనసాగిస్తున్నాడు. మానసిక స్థితి సరిగ్గా లేదని ఓ సారి, ఆరోగ్యం బాలేదని మరోసారి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. దేశంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా వివిధ బ్యాంకుల నుంచి 13 వేల 7 వందల కోట్లకుఎగనామం పెట్టి లండన్‌లో తలదాచుకుంటుండగా లండన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్ధిక నేరాల్లో నిందితుడు కావడంతో ఇండియాకు అప్పగించాలంటూ లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు కూడా ఆదేశాలిచ్చింది. ఇండియాలో మనీ ల్యాండరింగ్(Money laundering), నమ్మకద్రోహం వంటి నేరారోపణల్ని ఎదుర్కోవల్సి వస్తుందని తేల్చి చెప్పింది. ఇండియాకు వెళ్లకుండా తప్పించుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు నీరవ్ మోదీ. తనను ఇండియాకు అప్పగిస్తే ఆత్మహత్యే శరణ్యమని వ్యాఖ్యానించాడు. ఇప్పటికే లండన్ హైకోర్టు నీరవ్ మోదీ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఫలితంగా నీరవ్ మోదీని ఇండియాకు అప్పగించే మార్గం సుగమమైంది.


Also read: Pegasus spyware: నిఘా దేశంగా మార్చుతున్నారా ? కేంద్రంపై మమతా విమర్శలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook