న్యూఢిల్లీ: భారత్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన నిరవ్ మోడీని ఇవాళ లండన్‌లో అక్కడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ అనంతరం నిరవ్ మోడీని పోలీసులు లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ కోర్టులో హాజరుపర్చగా కోర్టు నిరవ్‌కి మార్చి 29వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కేసు విచారణను మార్చి 29వ తేదీ వరకు వాయిదా వేసింది. 


ఈ కేసు విచారణ సందర్భంగా నిరవ్ మోడీ తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేయగా కోర్టు ఆ బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. మార్చి 29వ తేదీ వరకు నిరవ్ మోడీ కస్టడీలోనే ఉండాల్సిందిగా కోర్టు తేల్చిచెప్పింది.