ప్రపంచానికి షాకింగ్ న్యూస్.. ఉత్తర కొరియా 15 ప్రదేశాల్లో అణు దాడి చేయవచ్చని నిఘా వర్గాల సమాచారం. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, గ్వామ్ ద్వీపాలే లక్ష్యంగా జిమ్ అణు బాంబు దాడికి సిద్ధమయ్యారని యూరోపియన్ కమీషన్ ఆఫ్ ఫారెన్ రిలేషన్స్ (ఈయూఎఫ్ఆర్) తెలిపింది. ఈ నాలుగు దేశాల్లో 15 చోట్ల ఆల్రెడీ ఉ.కొరియా పలుమార్లు రెక్కీ నిర్వహించింది. అన్నీ ఓకే.. అనుకున్న తరువాతే అణుదాడికి సిద్ధమైపోయిందని పేర్కొనింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తర కొరియా మీడియా సంస్థ నుండి తమకు లభించిన పక్కా సమాచారంతోనే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాము అని చెప్పింది ఈయూఎఫ్ఆర్. కాగా, ఉత్తర కొరియా ఎంచుకున్న ప్రాంతాల్లో చాలా వరకు ప్రదేశాలు ప్రసిద్ధమైనవిగా చెప్పుకొచ్చింది.


అమెరికా: వైట్ హౌస్, పెంటగాన్, న్యూయార్క్, మన్ హట్టర్, ఇతర ముఖ్య నగరాలు 
దక్షిణ కొరియా: సియోల్, బుసాన్, గ్యాంన్నేయంగ్ 
జపాన్: మిసావా, టోక్యో, ఓసాకా, యోకోహామా, క్యోటో