కరోనా వైరస్. . చైనాను గడగడలాడిస్తోంది. వైరస్ దెబ్బకు చైనాలో మరణమృదంగం మోగుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ దెబ్బకు 300 మందికి పైగా మృతి చెందారు. దాదాపు 2 వేల మంది ఆస్పత్రుల్లో కరోనా వైరస్ కు చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు వుహాన్‌లో హెల్త్ ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ఇటు హుబీ ప్రావిన్స్ లో కొత్తగా 45 కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.  ఇప్పటికే దీన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..  WHO .. కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది.  
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు వుహాన్ నుంచి భారతీయులను తీసుకుని  రెండో విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ విమానంలో 323 మంది భారతీయులతోపాటు ఏడుగురు మాల్దీవులకు చెందిన వారు ఉన్నారు. వారిని చావ్లా క్యాంప్ లోని  ఐటీబీపీ ఆస్పత్రితోపాటు మనేసర్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలిస్తున్నారు.


[[{"fid":"181608","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అటు కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే భారత్‌లో రెండో పాజిటివ్ కేసు నమోదు కాగా.. మిగతా దేశాల్లోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. గురువారం వరకు థాయిలాండ్ లో 14 కేసులు, హాంగ్ కాంగ్ లో 10, అమెరికా, తైవాన్ , ఆస్ట్రేలియా, మకావూ దేశాలలో ఐదు చొప్పున కేసులు , సింగపూర్, దక్షిణ కొరియా, మలేషియా దేశాల్లో నాలుగు చొప్పున, జపాన్‌లో 11, ఫ్రాన్స్‌లో 5, జర్మనీలో 4, కెనాడాలో 3, వియత్నాంలో రెండు, నేపాల్, కంబోడియా, యూఏఈలో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు తెలుస్తోంది.