US Covid-19: అమెరికాలో కరోనా మరణ మృదంగం..9 లక్షలు దాటిన మరణాలు..!!
US News: అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. సగటును రోజుకు 2400 మంది వైరస్ కు బలవుతున్నారు.
US COVID-19 death toll: అమెరికాలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఆ దేశంలో రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా మొత్తం మరణాల సంఖ్య 9లక్షలు (US COVID-19 death toll) దాటింది. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఈ స్థాయిలో కొవిడ్ మరణాలు సంభవించలేదు. అమెరికా తర్వాత 6 లక్షల మరణాలతో బ్రెజిల్ రెండో స్థానంలో, 5 లక్షల మరణాలతో భారత్ మూడో స్థానంలో ఉన్నాయి.
యూఎస్ లో కరోనా ప్రవేశించిన నాటి నుంచి శుక్రవారం వరకు కరోనా మృతుల సంఖ్య 9లక్షలు దాటినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ (Johns Hopkins University) వెల్లడించింది. ఈ సంఖ్య ఇండియానాపోలిస్, శాన్ ఫ్రాన్సిస్కో, నార్త్ కరోలినాలోని మొత్తం జనాభా కంటే ఎక్కువ ఉండటం విశేషం. ఒమిక్రాన్ వ్యాప్తితో అమెరికాలో రోజుకు లక్షల సంఖ్యలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. కేవలం రెండు నెలల వ్యవధిలోనే లక్ష మంది మృతి చెందారు.
అమెరికాలో కరోనా తొలి మరణం 2020 ఫిబ్రవరిలో నమోదైంది. అప్పుడు మొదలదైన మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. గతేడాది డిసెంబరు మధ్యలో 8లక్షలుగా ఉన్న మరణాల సంఖ్య తాజాగా 9లక్షల మార్క్‌ను దాటింది. మరణాల సంఖ్యపై అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) విచారం వ్యక్తం చేశారు. యూఎస్ లో ఇప్పటివరకు అక్కడ కేవలం 64శాతం మంది మాత్రమే రెండు డోసులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Covid Vaccine: ఐదేళ్ల లోపు చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్.. అత్యవసర అనుమతి కోరిన ఫైజర్-బయోఎన్‌టెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి