US travel rules tighten: ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ భయాలు (Omicron scare in US) వెంటాడుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది. కొత్త వేరియంట్ కట్టడికి కఠిన నిబంధనలను అనుసరించాలని జో బైడెన్​ ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే వారం నుంచి అమలులోకి రానున్న కొత్త కొవిడ్ రూల్సే ఇందుకు (US Corona rules) నిదర్శనం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటిక వరకు అమెరికా వ్యాప్తంగా 10 ఒమిక్రాన్ కేసులు (Omicron cases in US) బయటపడ్డాయి. కాలిఫోర్నియా, కొలరాడో, మిన్నెసొటా, న్యూయార్క్​, హవాయ్​ రాష్ట్రాల్లో ఇవి నమోదయ్యాయి. అయితే ఈ వెరియంట్ సోకిన వారందరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు ఆరోగ్య శాఖ అధికారులు.


అమెరికా కొత్త రూల్స్ ఇలా..


వచ్చే వారం నుంచి అమెరికాకు వచ్చే అంతర్జాతీయ, దేశీయ ప్రయాణికులు కొవిడ్ టెస్ట్​ నెగెటివి్​ రిపోర్ట్ చూయించడం తప్పనిసరి. టెస్టు రిజల్ట్​ 24 గంటల లోపు చేయించుకున్నది మాత్రమే ఉండాలి. టీకా తీసుకున్న వారికి కూడా టెస్ట్​ తప్పనిసరి.


ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న వారు.. సంబంధిత రిపోర్ట్​లు చూయించాలి.


మాస్క్ తప్పనిసరి నిబంధనలు వచ్చే ఏడాది జనవరితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రూల్​ను మార్చి వరకు పొడగించనుంది ప్రభుత్వం. మాస్క్ లేకుండా బయకు వస్తే భారీ జరిమానా విధించనుంది.


లక్షల సంఖ్యలో ఇళ్ల వద్దకే వచ్చి ఉచిత కొవిడ్ పరీక్షలు చేయనున్నారు. ఎవరైనా వీటిని వినియోగించుకోవచ్చు.


అందరూ బూస్టర్ డోసు కూడా వేసుకోవాలని ప్రభుత్వం సూచన.


ఇప్పటి వరకు అమెరికాలో 4 కోట్ల మంది బూస్టర్ డోసు వ్యాక్సిన్​ వేసుకున్నారు. మరో 10 కోట్ల మంది అర్హులు బూస్టర్ డోసు తీసుకోవాల్సి ఉంది.


వ్యాక్సినేషన్ వేగం పెంచేందుకు.. దేశవ్యాప్తంగా తాత్కాలిక క్లినిక్​లను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం.. ముఖ్యంగా టీనేజర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.


Also read: Omicron: కెనడాలో ఒమిక్రాన్ కలకలం-15 కేసులు గుర్తింపు-ఆరోగ్య శాఖ కీలక విజ్ఞప్తి


Also read: Omicron: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్.. వర్క్‌ఫ్రమ్‌ హోంపై కీలక ప్రకటన చేసిన గూగుల్‌!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook