Omicron Status: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచంపై ముప్పేట దాడి చేస్తోంది. ఒక్కొక్కదేశానికి సంక్రమిస్తూ ఆందోళన రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ సోకిన దేశాల సంఖ్య అప్పుడే 46కు చేరుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిడ్ 19 వైరస్(Covid19)రూపం మార్చుకుని దాడి చేస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అప్పుడే 46 దేశాలకు వ్యాపించేసింది. రోజురోజుకూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఓ వైపు డెల్టా వేరియంట్ నుంచి ప్రపంచదేశాలు బయటపడకముందే ఒమిక్రాన్ రూపంలో దాడి జరుగుతుండటం కలకలం రేపుతోంది. ఊహించినవిధంగానే ఒమిక్రాన్ 6 రెట్ల వేగంతో సంక్రమిస్తోందని తెలుస్తోంది. 


దక్షణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant)సోకిన వారి సంఖ్య 941కు చేరుకుంది. ఒక్క బ్రిటన్‌లోనే 246 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రెండవ స్థానంలో దక్షిణాఫ్రికాలో 228 కేసులు, జింబాబ్వేలో 50, అమెరికాలో 39 కేసులు నమోదయ్యాయి. ఇక ఇండియాలో ఇప్పటి వరకూ 21 కేసులు వెలుగు చూశాయి. మరికొన్ని పరీక్షల వివరాలు అందాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. మరోవైపు ఆఫ్రికా దేశాల్నించి వచ్చినవారిలో చాలామంది ఆచూకీ లభ్యం కావడం లేదు. పాస్‌పోర్టుల్లో ఉన్న చిరునామాల్లో లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఎందుకంటే వీరిలో ఎవరికైనా ఒమిక్రాన్ సోకి ఉంటే..అది స్థానికంగా సంక్రమించే అవకాశముంది. మరోవైపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణీకులపై నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. 


Also read: Indonesia Volcano Eruption: బద్దలైన అతిపెద్ద అగ్నిపర్వతం, నదిలా ప్రవహిస్తున్న లావా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook