Omicron Survival Rate: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు (Omicron) సంబంధించిన తాజా పరిశోధన పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఆ పరిశోధన ప్రకారం... మనిషి చర్మంపై ఒమిక్రాన్ వైరస్ 21 గంటల పాటు సజీవంగా ఉండగలదు. ప్లాస్టిక్‌ వస్తువులపై ఏకంగా ఎనిమిది రోజుల పాటు వైరస్ సజీవంగా ఉండగలదు. అల్ఫా, బీటా, గామా, డెల్టాలతో పోలిస్తే ఒమిక్రాన్ వైరస్ మనిషి చర్మం, ప్లాస్టిక్‌పై రెండు రెట్లు ఎక్కువ మనుగడ సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. జపాన్‌లోని (Japan) క్యోటో యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒమిక్రాన్‌ (Omicron Variant) మనిషి చర్మంపై 21.1గంటల పాటు సజీవంగా ఉంటుందని.. అదే సమయంలో కరోనా వైరస్ (SARS-CoV-2) 8.6 గంటలు, అల్ఫా వేరియంట్ 19.6 గంటలు, బీటా వేరియంట్ 19.1 గంటలు, గామా వేరియంట్ 11 గంటలు, డెల్టా వేరియంట్ 16.8 గంటల పాటు సజీవంగా ఉండగలవని పరిశోధనలో తేలింది. ఇప్పటివరకూ డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన అన్ని ఆందోళనకర వేరియంట్లలో ఒమిక్రాన్ వేరియంట్‌కు ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని మనుగడ సాగించే సామర్థ్యం ఎక్కువ ఉన్నట్లు స్పష్టమైంది.


ఒమిక్రాన్ వైరస్ ప్లాస్టిక్‌ ఉపరితలంపై 193.5 గంటలు ( సుమారు 8 రోజులు) మనుగడ సాగించగలదని... ఇది ఒరిజినల్ వేరియంట్‌తో పోలిస్తే మూడు రెట్లు అధికమని పరిశోధకులు కనుగొన్నారు. ఒరిజినల్ వేరియంట్ ప్లాస్టిక్ ఉపరితలంపై 56 గంటలు మాత్రమే మనుగడ సాగించగలదని.. గామా వేరియంట్ 59.3 గంటలు, డెల్టా వేరియంట్ 114 గంటలు, బీటా వేరియంట్ 156.6 గంటలు, అల్ఫా వేరియంట్ 191.3 గంటలు మనుగడ సాగించగలదని కనుగొన్నారు. 


ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ఇథనాల్ రెసిస్టెన్స్‌లో స్వల్ప పెరుగుదలను సూచించినట్లు పరిశోధకులు గుర్తించారు. అదే సమయంలో ఆల్కాహాల్ శానిటైజర్‌ అన్ని రకాల కరోనా వేరియంట్లకు (Covid 19 Variant) చెక్ పెట్టగలదని తేల్చారు. ఆల్కాహాల్ శానిటైజర్ అప్లై చేసిన 15 సెకన్లలో వైరస్ పూర్తిగా క్రియారహితంగా మారిపోతుందని కనుగొన్నారు. అందుకే డబ్ల్యూహెచ్ఓ ఆల్కాహాల్ ఆధారిత శానిటైజర్ల వినియోగాన్ని పదేపదే నొక్కి చెబుతోందని గుర్తుచేస్తున్నారు.


Also Read: FIR on Sundar Pichai: సుందర్ పిచాయ్​కి నిన్న పద్మ పురస్కారం- నేడు కాపీరైట్​ కేసు!


Also read: Bihar Protests: ఆర్ఆర్‌బీ ఫలితాలపై వివాదం.. అట్టుడుకుతున్న బీహార్.. రైలుకు నిప్పంటించిన విద్యార్థులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook