Corona Cases in US: యూఎస్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతూ ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికాలో సోమవారం ఒక్కరోజే 10లక్షల కొవిడ్ కేసులు (Corona cases in US) వెలుగుచూశాయి. ప్రస్తుతం అక్కడ కరోనావైరస్ సెకెండ్ వేవ్‌ కంటే మూడు రెట్లకుపైగా కేసులు నమోదవుతున్నాయి. జాన్స్​ హాప్కిన్స్​ యూనివర్సిటీ డేటా (Johns Hopkins University data) ప్రకారం.. 10,42,000 పైగా కొత్త కేసులు వచ్చాయి. గతవారంలో ప్రతి 100 మంది అమెరికన్లలో ఒకరికి కరోనా పాజిటివ్​గా నమోదవుతున్నట్లుగా తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికాలో గత రెండువారాలుగా కరోనా కేసులు (Covid Cases in America) వేగంగా పెరుగుతున్నాయి. సోమవారం యూఎస్ లో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు కరోనా వైరస్ బారిన పడినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఒక్కరోజులో 5,91,000 కరోనా కేసులు నమోదయ్యాయి.


యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ తాజా గణాంకాల ప్రకారం కోవిడ్ -19 (COVID-19) ఇన్‌ఫెక్షన్ కారణంగా ప్రస్తుతం 1,03,000 మందికి పైగా ప్రజలు ఆసుపత్రిలో ఉన్నారు. అమెరికాలో నాలుగు నెలల గరిష్ఠానికి ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య చేరింది.


Also Read: Good News: ఒమిక్రాన్‌పై గుడ్‌న్యూస్, ఇక ఆందోళన అవసరం లేదట


అమెరికాలో ఇప్పటి వరకు 55 మిలియన్లకుపైగా కొవిడ్​-19 కేసులు వెలుగు చూసినట్లు జాన్స్​ హాప్కిన్స్​ వర్సిటీ డేటా తెలుపుతుంది. దేశంలో ప్రతి ఆరుగురిలో ఒక్కరికి కరోనా ఉంది. వైరస్ తో 8,26,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు.. 12-15 ఏళ్ల వయసు వారితో పాటు బూస్టర్​ డోస్​ అందించేందుకు ఫైజర్​ బయోఎన్​టెక్ (Pfizer-BioNTech)​ టీకాకు అనుమతులు ఇచ్చింది ఎఫ్​డీఏ. దేశంలో ఒమిక్రాన్​ కేసులు (Omicron cases in us) భారీగా నమోదవుతున్న క్రమంలో..అధ్యక్షుడు జో బైడెన్ (President Joe Biden)​, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​లు మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి