పాకిస్తాన్ మాజీ క్రికెట్ కెప్టెన్ మరియు ఆ దేశ రాజకీయవేత్త ఇమ్రాన్ ఖాన్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గురించి పలు ఆసక్తికరమైన కామెంట్లు ట్వీట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆయన అవగాహన రాహిత్యం వల్ల జయలలిత పేరు బదులు శశికళ పేరును వాడడం వల్ల ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జయలలితను శశికళగా పొరబడిన ఇమ్రాన్ ట్వీట్ చేస్తూ "శశికళ అనే దక్షిణ భారతీయ నటీమణి మరియు రాజకీయవేత్త ఇటీవలే మరణించారు. ఆమె మరణించాక తన ఇంట్లో పెద్ద ఎత్తున్న బంగారు వస్తువులతో పాటు డబ్బు కూడా దొరకడం గమనార్హం. అవినీతిపరులైన నాయకులు అందరికీ ఇదే సందేశం. పేదల నుండి దోచుకున్న సంపద అంతా మీరు అనుభవించకుండానే మరణిస్తారు" అని ఇమ్రాన్ ట్వీట్ చేశారు.


ఈ ట్వీట్‌కి గల్ఫ్ న్యూస్ జర్నలిస్టు బదులిస్తూ "డియర్ ఇమ్రాన్, మీరు తప్పుగా రాశారు. ప్రస్తుతం జయలలిత జైలులో ఉన్నారు. ఆమె స్నేహితురాలు మరియు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రైన జయలలిత చనిపోయి ఇప్పటికి సంవత్సరం కావస్తోంది. అలాగే మీరు పోస్టు చేసిన ఫోటోలు కూడా నకిలీవి. మీలాంటి సీనియర్ పొలిటీషియన్లు ఇలా ట్వీట్ చేయడం తగునా" అని ఆయన బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.