ముంబై పేలుళ్ల సూత్రధారి, కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాక్ కోర్టులో ఊరట లభించింది. హఫీజ్ స్థాపించిన జమాద్ ఉద్ దవా, ఫలా ఇ ఇన్సానియత్ ఫౌండేషన్ సంస్థలు నిషేధిత జాబితాలో ఉండబోవని ఇస్లామాబాద్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇక నుంచి హఫీజ్ కు చెందిన సంస్థలు తమ కార్యాకలాపాలు యదేచ్ఛగా కొనసాగించేందుకు అనుమతి ఇచ్చినట్లు మీడియా వర్గాల నుంచి సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్ అమెరికా తో పాటు ప్రపంచ దేశాలు ఒత్తిడితో పాక్ మాజీ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఫిబ్రవరిలో ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారు. అయితే అప్పట్లో ఈ ఆర్డినెన్స్‌ను చట్టంగా మార్చలేదు. కాగా ఈ ఆర్డినెన్స్ గడువు ముగిసిపోవడంతో తన సంస్థలపై ఉన్న నిషేధం చెల్లదని హఫీజ్ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన పాక్ కోర్టు ఈ మేరుకు తీర్పు వెలువరించింది.


పాకిస్తాన్ దేశం ఉగ్రవాదులకు స్వర్గధామం అని మరోమారు రుజువైంది. ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరగవచ్చని.. ఉగ్రవాద భావజాలం ఉన్న సంస్థలు  యథేచ్ఛగా తమ తమ  కార్యకలపాలు నడుపుకోవచ్చని తేల్చింది. హఫీజ్ సయిద్ విషయంలో ఇచ్చిన తీర్పే ఇందుకు ఉదాహరణగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.