Karachi University blast: పాకిస్థాన్ ఆర్థిక రాజధానిలోని కరాచీ యూనివర్శిటీ (Karachi University) ప్రాంగణంలో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు చైనీస్ పౌరులతో సహా నలుగురు మరణించారు. ఇందులో ఓ పాకిస్థానీ డ్రైవర్‌ కూడా ఉన్నాడు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు పాకిస్తాన్ మీడియా నివేదించింది. యూనివర్శిటీలోని కన్ఫ్యూషియస్ ఇనిస్టిట్యూట్ సమీపంలోని వ్యాన్‌లో పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. చనిపోయిన వారిలో చైనీస్-నిర్మిత కన్ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. వ్యాన్‌లో ఏడెనిమిది మంది ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది ఆత్మాహుతి బాంబర్ దాడిగా ప్రాథమిక దర్యాప్తులో తేలిననట్లు కరాచీ పోలీసు చీఫ్ గులాం నబీ మెమన్  తెలిపారు. ఆడ బురఖా ధరించిని వ్యక్తి వ్యాన్  దగ్గరకు వెళ్లగానే పేలుడు జరిగినట్లు..సీసీటీవీ పుటేజీలో రికార్డు అయినట్లు ఆయన తెలిపారు. కరాచీ యూనివర్శిటీలోని చైనీస్ భాషా బోధనా కేంద్రం సమీపంలోని వ్యాన్‌లో మధ్యాహ్నం 1.52 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) పేలుడు (van blast in Karachi University) జరిగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న రెస్క్యూ మరియు భద్రతా దళాలు సంఘటనా స్థలానికి  చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పేలుడు ఘటనపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ (PM Shehbaz Sharif) టెలిఫోన్ కాల్‌లో విచారం వ్యక్తం చేసినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. 


మేమే చేశాం: బీఎల్ఏ
ఈ దాడికి బాధ్యులమని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army) ప్రకటించింది. మహిళా ఆత్మాహుతి బాంబర్ షరీ బలోచ్ అలియాస్ బ్రాంష్ ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొంది. జూలై 2021లో వాయువ్య ప్రాంతంలోని దాసు వద్ద బస్సుపై బాంబు దాడి చేసి తొమ్మిది మంది చైనీస్ జాతీయులను చంపిన తర్వాత పాకిస్తాన్‌లో చైనా జాతీయులపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే. 


Also Read: Russia Ukraine War: రష్యా ఆయిల్ డిపోలో పేలుడు.. భారీ ఎత్తున ఎగిసిపడ్డ మంటలు.. ఉక్రెయిన్ పనేనా..? 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.