Pakistan Crisis: పరువు కోసం పాకిస్థాన్ తిప్పలు.. భిక్షగాళ్లపై బ్రహ్మాస్త్రం.. ఇదేం తీరయ్యా..!
Pakistan Beggars: పాకిస్థాన్ పరువు కోసం పాకులాడుతోంది. ఇతర దేశాల్లో భిక్షాటన చేస్తున్న తమ దేశస్తుల పాస్ పోర్టులను రద్దు చేస్తోంది. విదేశాల్లో తమ పరువు పోతుందని ఇప్పటికే 7 వేల మంది పాస్ట్ పోర్టులను సస్పెండ్ చేసింది.
Pakistan Beggars: పాకిస్థాన్ ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతోంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో పేద దేశంగా మారింది. ఆ దేశంలో డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి డబ్బు లేకపోవడంతో ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి సంస్థల ముందు యాచిస్తోంది. చివరికి పాకిస్థాన్ పౌరులు విదేశాలకు వెళ్లి అడుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తమ దేశం పరువు పోకుండా ఉండేందుకు పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉండే తమ దేశానికి చెందిన యాచకులను ఆరికట్టేందుకు నడుం బిగించింది. విదేశాల్లో భిక్షాటన చేసే వారి పాస్ పోర్టులను పాకిస్థాన్ ప్రభుత్వం రద్దు చేస్తోంది.
Also Read: Budget 2024: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. జీతంలో 50 శాతం వరకు పెన్షన్‌కు ఛాన్స్..!
2 వేల మందికి పైగా వృత్తిపరమైన యాచకుల పాస్‌పోర్ట్‌లను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పాకిస్థాన్ డాన్ న్యూస్ వెల్లడించింది. విదేశాలకు వెళ్లి భిక్షాటన చేసి దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని.. ఇతర దేశాల్లో భిక్షాటన చేస్తున్న పాకిస్థాన్ వ్యక్తుల జాబితాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాక్ రాయబార కార్యాలయాల నుంచి సేకరిస్తున్నట్లు పేర్కొంది. విదేశాల్లో భిక్షాటన చేస్తూ పట్టుబడిన వ్యక్తుల పాస్‌పోర్ట్‌లను ఏడేళ్లపాటు సస్పెండ్ చేయవచ్చని ఆ న్యూస్‌లో వెల్లడించింది. విదేశాల్లో తమ దేశస్తులు భిక్షాటన చేయడంతో దేశ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా పౌరుల గౌరవం కూడా తగ్గుతుందని పాక్ అధికారులు పేర్కొన్నారు.
భిక్షాటన చేసే వాళ్లకు పాస్‌పోర్టులు అందజేస్తున్న ఏజెంట్ల పాస్‌పోర్టులను కూడా ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన చాలా మంది సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ వంటి దేశాలకు తీర్థయాత్ర లేదా ఉమ్రా కోసం వెళ్లి.. అక్కడికి చేరుకున్న తరువాత భిక్షాటన చేస్తున్నట్లు తేలింది. గతేడాది అక్టోబర్‌లో పాకిస్థాన్ నుంచి భిక్షాటనకు వెళుతున్నారనే అనుమానంతో చాలా మందిని అరెస్టు చేశారు. వీరంతా యాత్రికులుగా యాక్ట్ చేస్తూ.. సౌదీ అరేబియాకు విమానం ఎక్కుతున్నారనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ముల్తాన్ విమానాశ్రయంలోని సౌదీ అరేబియాకు వెళ్లే విమానం నుంచి 16 మందిని భిక్షాటన చేస్తున్నారనే అనుమానంతో డిబోర్డ్ చేశారు.
వాళ్లందరూ మక్కాకు ఇస్లామిక్ తీర్థయాత్ర కోసం ఉమ్రా వీసాతో వెళుతున్నారు. ఈ వీసాతో ఏడాదిలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు.
మధ్యప్రాచ్య దేశాలలో అరెస్ట్ అయిన ప్రొఫెషనల్ బిచ్చగాళ్లలో 90 శాతం మంది పాకిస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించారు. సౌదీ అరేబియాలోని ప్రతిష్టాత్మక గ్రాండ్ మసీదు చుట్టూ పాకిస్థాన్‌కు చెందిన వారు జేబు దొంగతనాలకు కూడా పాల్పడుతున్నట్లు తేలింది. పాకిస్థాన్‌లో భిక్షాటన సాధారణంగా మారిపోయింది. దేశంలోని బిచ్చగాళ్లు ప్రతి నెల సగటున 50 వేల పాకిస్థానీ రూపాయలు సంపాదిస్తున్నారని ఓ నివేదికలో వెల్లడైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి