వేర్పాటు వాదులకు మద్దతు కొనసాగిస్తామని పాక్ బహిరంగ ప్రకటన !
పాక్ సర్కార్ దొడ్డిదారిలో చేస్తున్న పనిని బహిరంగంగా ఒప్పుకుంది. కశ్మీర్ లోని ఏర్పాటు వాదులకు తమ మద్దతు కొనసాగిస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖుర్రమ్ దస్తగిర్ ఖాన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన భారత్ పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారతదేశం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. కశ్మీర్ అంశంపై మాట్లాడుతూ ప్రాంతీయ సహకారం పెంపొందడం వల్ల ఆ ప్రాంతం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని.. అందుకు తాము సిద్ధం ఉన్నట్లు పాక్ రక్షణ మంత్రి వెల్లడించారు.
పాక్ ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. ఆ పాపం భారత్ పై నెట్టేందుకు ప్రయ్నతించడం హాస్యాస్పదం. అంతర్జాతీయ సమాజంలో భారత్ ను దోషిగా చిత్రీకరించాలనే తాపత్రయంతో పాక్ విదేశంగా శాఖ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అలాగే కశ్మీర్ అంశంపై ప్రాంతీయ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ పేర్కొడం హాస్యస్పదం. ఒక వైపు ఉగ్రవాదులను ఉసి గొల్పుతూ కశ్మీర్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకుంటూ మరో వైపు ప్రాంతీయ సహాకారం చేస్తామని చెప్పడం దెయ్యాలు వేదాలు అల్లినట్లుగా ఉంది కదూ. ఒక వేళ కశ్మీర్ సమస్యను పరిష్కరించాలనే చిత్తుశుద్ధి పాక్ లో ఉంటే నియంత్రణ రేఖ వద్ద ఘర్షణ వాతావణం సృష్టించే చర్యలను పాక్ విరమించుకోవాలని మేధావులు సూచిస్తున్నారు.