Imran Khan Arrest: పాకిస్తాన్‌లో కక్ష రాజకీయాలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. పదవీచ్యుతుడైన ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమౌతోంది. ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాయాది దేశం పాకిస్తాన్‌లో రాజకీయాలు చాలా దారుణంగా ఉంటాయి. పదవి నుంచి దిగిపోగానే కక్ష రాజకీయాలు మొదలైపోతున్నాయి. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఘోరంగా అవమాన భరితుడై ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి పదవీచ్యుతడయ్యాడు. ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశంలోని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో పదవి నుంచి దిగిపోక తప్పలేదు. 


ఇమ్రాన్ పదవి నుంచి దిగిపోగానే..ప్రతిపక్ష నేత మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌కు షాక్ ఇచ్చేందుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం సిద్ధమైంది. అధికారంలో ఉండగా నిధులు దుర్వినియోగం చేశాడంటూ ఇమ్రాన్ ఖాన్‌పై కేసు నమోదు చేసింది అక్కడి ప్రభుత్వం. ఏక్షణంలోనైనా అరెస్టు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ అధికారులు కూడా ఇందుకు రంగం సిద్ధం చేశారు. 


ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రంజాన్ వేడుకల్లో భాగంగా సౌదీ అరేబియాలో ఉన్నారు. ఈద్ తరువాత ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చని సమాచారం. 


Also read; All Set For Putin Surgery: సర్జరీకి సిద్ధమైన రష్యా అధ్యక్షుడు పుతిన్‌..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook