న్యూఢిల్లీ: పాకిస్తాన్, కరాచీలోని నివాస ప్రాంతంలో విమానం కుప్పకూలిన విషయాన్ని అంతర్జాతీయ మీడియా ధృవీకరించింది. ఈ విమానంలో మొత్తం 107 మంది వున్నారని, ప్రయాణికులంతా మరణించి వుంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఈ విమానం నివాస ప్రాంతంలో కూలడంతో అక్కడ కూడా ప్రాణనష్టం జరిగి వుండొచ్చని, ల్యాండింగ్ సమయంలో విమానం కూలడంతో సమీపంలోని నివాస భవానాలు, అపార్ట్‌మెంట్లు పెద్ద ఎత్తున ధ్వంసం కాబడి ఉంటుందని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది కూడా చదవండి: తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల


కరాచీలోని మహ్మద్ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగకు సిద్దమవుతున్న సమయంలో ఎయిర్ బస్ 320 కుప్పకూలిందని ఉర్దూ మీడియా సంస్థ తెలిపింది. లాహోర్ నుండి కరాచీ వస్తున్న పాకిస్తాన్ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 107 మంది వున్నట్లు సమాచారం. విమానాశ్రయం ప్రాంతంలో భారీ సంఖ్యలో ప్రజలు నివసించే ప్రాంతమని, విమానంలో వున్న మొత్తం మంది సహా కూలిన స్థలంలో మృతుల సంఖ్య వందకు పైగానే వుంటుందని భావిస్తున్నారు. విమానం కూలిన ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  


Also Read: coronavirus vaccine: అద్భుతంగా కరోనా టీకా అధ్యయనాలు.. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్