Mob Lynching: పాక్‌లో శ్రీలంక జాతీయుడి దారుణ హత్య-నడిరోడ్డుపై కొట్టి చంపి,తగలబెట్టారు
Pakistan mob lynches Srilankan over blasphemy: పాకిస్తాన్‌లో ఓ శ్రీలంక జాతీయుడిని దారుణంగా హతమార్చారు. దైవ దూషణకు పాల్పడ్డాడనే ఆరోపణలతో నడిరోడ్డుపై కొట్టి చంపారు. ఈ ఘటన శ్రీలంక ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
Pakistan mob lynches Srilankan over blasphemy: పాకిస్తాన్‌లో దారుణం జరిగింది. దైవ దూషణకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఓ శ్రీలంక (Srilanka) వ్యక్తిని కొంతమంది మూక నడిరోడ్డుపై చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు. ఆపై నడిరోడ్డు పైనే మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. పంజాబ్ సియాల్‌కోట్‌లోని వజీరాబాద్ రోడ్డులో శుక్రవారం (డిసెంబర్ 3) ఈ ఘటన చోటు చేసుకుంది.
పాకిస్తాన్ మీడియా కథనం ప్రకారం... శ్రీలంక దేశస్తుడైన ప్రియంత కుమార (40) సియాల్ కోట్‌లోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆ ఫ్యాక్టరీ గోడపై ఇటీవల తెహ్రీక్-ఇ-లబ్బయిక్ పాకిస్తాన్ (TLP) కార్యకర్తలు ఓ పోస్టర్ అతికించారు. ఆ పోస్టర్‌ను ప్రియంత కుమార తొలగించాడనే ఆరోపణలున్నాయి. పోస్టర్‌ను అతను చించివేస్తుండగా తాము చూశామని... ఫ్యాక్టరీలో పనిచేసే కొంతమంది కార్మికులు అందరికీ ప్రచారం చేశారు. ఆ పోస్టర్‌పై ఖురాన్ ముద్రించి ఉండటంతో అతను దైవ దూషణకు పాల్పడ్డాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ విషయం తెలిసిన వెంటనే టీఎల్పీ కార్యకర్తలు వందలాదిగా ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. ప్రియంత కుమారను ఫ్యాక్టరీ నుంచి రోడ్డు పైకి లాక్కొచ్చి విచక్షణారహితంగా దాడి (Mob lynching in Pakistan) చేశారు. అతన్ని చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. ఆపై నడిరోడ్డు పైనే అతని మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ సమయంలో టీఎల్పీ పార్టీకి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో పలు వీడియోలు వెలుగుచూశాయి.
పాకిస్తాన్‌లో టీఎల్పీ పార్టీపై ఉగ్రవాద ముద్ర ఉంది. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ప్రభుత్వం ఇటీవలే ఆ పార్టీపై ఉన్న నిషేధాన్ని తొలగించింది. ఇందుకోసం ఆ పార్టీతో ఇమ్రాన్ సర్కార్ సీక్రెట్ ఒప్పందం చేసుకుందనే వాదన ఉంది. ఆ ఒప్పందం తర్వాత టీఎల్పీకి చెందిన 1500 మంది కార్యకర్తలను ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. ఈ ఘటన చాలా విచారకరమని... దీనిపై విచారణకు ఆదేశించామని పంజాబ్ సీఎం తెలిపారు.
Also Read: Coronavirus: ఆ దేశంలో ఇటీవలే మొట్టమొదటి కరోనా కేసు...
పాకిస్తాన్‌తో ఎప్పుడూ సత్సంబంధాలు నెరిపే శ్రీలంక ప్రభుత్వాన్ని (Srilanka) ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై తక్షణమే విచారణ జరిపి నేరస్తులను కఠినంగా శిక్షించాలని శ్రీలంక పాకిస్తాన్‌ను డిమాండ్ చేసింది. 'పాకిస్తాన్ సియాల్‌కోట్‌లో జరిగిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో ఇమ్రాన్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్ముతున్నాం. అలాగే పాకిస్తాన్‌లోని మిగతా శ్రీలంక వర్కర్లకు కూడా ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలి.' అని శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook